India's First Sologamy Marriage: తనను తానే పెళ్లాడతానని ప్రకటించి వార్తల్లో నిలిచిన గుజరాత్ యువతి క్షమా బిందు చెప్పినట్లుగానే 'స్వీయ వివాహం' చేసుకుంది. పెళ్లిలో జరగాల్సిన అన్ని కార్యక్రమాలు ఈ వివాహ వేడుకలో జరిగాయి. ఒక్క వరుడు లేడు అనే లోటు తప్ప బాజా బజంత్రీలు, బంధువుల మధ్య వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.






అన్నీ ఉన్నాయ్




ఈ సందర్భంగా సంప్రదాయం ప్రకారం అన్ని వేడుకలు చేసుకుంది క్షమా. హల్దీ, మెహందీ కార్యక్రమాలతో పాటు పెళ్లిలో వేద మంత్రాలు, ఏడడుగులు కూడా నడిచింది. తనకు తానే సింధూరాన్ని ధరించి వివాహితగా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. దేశంలోనే తొలి స్వీయ వివాహం (సోలోగమీ) ఇదే.


ముహూర్తానికి ముందుగా


గుజరాత్‌లోని వడోదరకు చెందిన 24 ఏళ్ల క్షమా బిందు తనను తానే పెళ్లాడతానని ఇటీవల ప్రకటించింది. గోత్రిలోని ఓ ఆలయంలో వివాహం చేసుకునేందుకు జూన్‌ 11న ముహూర్తం కూడా నిశ్చయమైంది. అయితే ఈ వివాహాన్ని కొంతమంది రాజకీయ నేతలు, సామాజిక కార్యకర్తలు వ్యతిరేకించారు. ఆమె పెళ్లిని అడ్డుకుంటామని హెచ్చరించారు. దీంతో అనుకున్న ముహూర్తం కంటే రెండు రోజుల ముందే అత్యంత సన్నిహితుల సమక్షంలో ఇంట్లోనే క్షమా గురువారం వివాహం చేసుకుంది.


ఏం చేసింది?


వడోదరకు చెందిన క్షమా బిందు.. సోషియాలజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. ప్రస్తుతం ఓ ప్రైవేటు కంపెనీలో సీనియర్‌ రిక్రూట్‌మెంట్‌ అధికారిణిగా పనిచేస్తోంది. ఆమె తల్లిదండ్రులిద్దరూ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. తండ్రి దక్షిణాఫ్రికాలో ఉంటుండగా, తల్లి అహ్మదాబాద్‌లో ఉంటున్నారు. స్నేహితుల సమక్షంలో జరిగిన క్షమా పెళ్లికి వారు వీడియోకాల్‌ ద్వారా హాజరయ్యారు.


Also Read: Weather Update: రుతుపవనాల రాకలో ఆలస్యం లేదు- 2 రోజుల్లో ఇక దంచుడే దంచుడు: IMD


Also Read: Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల- జులై 18న పోలింగ్