వాతావరణంలో వస్తున్న మార్పులు కారణంగా చాలా అంశాల్లో అనూహ్యమైన మార్పులు చూస్తున్నాం. అతి వృష్టి, అనావృష్టి, అనూహ్యమైన వరదలు ఇలాంటి మనం నిత్యం గమనిస్తూనే ఉన్నాం. ఇప్పటికే చాలా రకాల పంటల దిగుబడి పడిపోయింది. ఇప్పుడు  టొమోటో పంటలపై  కూడా పడుతుందని తాజా అధ్యయనం చెబుతోంది.


టొమాటో కెచప్ ప్రియులకు నిజంగా ఇది చేదువార్త. వాతావరణ మార్పు రాబోయే సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా టమోటాల పంటను ప్రభావితం చేస్తుందని పరిశోధనలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా అనేక గృహాలు, రెస్టారెంట్లలో ప్రధానమైన కెచప్ సరఫరాపై ప్రభావం చూపుతుందని తెలిపిందా పరిశోధన.


ఎరుపు, తీపి, జ్యుసి, పండిన టొమాటోలతో కెచప్ తయారు చేస్తారు. ఇది పెరుగుతున్న ఉష్ణోగ్రత కారణంగా ప్రమాదానికి గురవుతుందని నేచర్‌లో ప్రచురించిన అధ్యయనం తెలిపింది.


డెన్మార్క్‌లోని ఆర్హస్ విశ్వవిద్యాలయం నేతృత్వంలోని పరిశోధకుల బృందం, పెరుగుతున్న ఉష్ణోగ్రత టమోటాల ఉత్పత్తిని ఎలా ప్రభావితం చేస్తుందో అంచనా వేయడానికి అధ్యయనం చేశారు. ఇందులో ఓ నమూనా రూపొందించింది.


టొమాటో ఉత్పత్తిలో ఇటలీ, చైనా, కాలిఫోర్నియా దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రపంచ ఉత్పత్తిలో మూడింట రెండు వంతులు ఇక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్నాయి. ఈ దేశాలు గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రమాదంలో ఉన్నాయని అధ్యయనం తెలిపింది.


ఈ పరిశోధన బృందం చెప్పిన ఫార్ములా ప్రకారం..  2050, 2100 మధ్యకాలంలో టమోటా పంట సగానికి తగ్గిపోతుందని కనుగొన్నారు. 2050 నాటికి టొమాటో ఉత్పత్తిపై ఆరు శాతం క్షీణత ఉంటుందని పరిశోధన పేర్కొంది.


2040, 2069 మధ్య టొమాటో ఉత్పత్తి ప్రాంతాలలో 2.6 డిగ్రీల సెల్సియస్, తదుపరి 30 సంవత్సరాలలో 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుదల ఉంటుంది. 1980, 2009 మధ్య ఉష్ణోగ్రతలను తీసుకొని ఈ అంచనాలు రూపొందించారు. 


"వాతావరణ CO2 గాఢత అధిక ఉష్ణోగ్రతల ప్రతికూల ప్రభావాలను పూర్తిగా భర్తీ చేయవచ్చు, కానీ పూర్తిగా భర్తీ చేయదు" అని జూన్ 6 తెలిపింది పరిశోధన బృందం.


కంప్యూటరైజ్డ్ నమూనా మరింత ఆశ్చర్యకరమైన అంశాలు వెల్లడించింది. ప్రాసెసింగ్ టొమాటోలను టొమాటో పేస్ట్, కెచప్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. 11 అతిపెద్ద సాగుదారులలో ప్రస్తుత 14 మిలియన్ టన్నుల నుంచి ఏడు మిలియన్ టన్నుల కంటే తక్కువకు పడిపోనుంది. 


గత నెల వచ్చన ఓ నివేదిక ప్రకారం మార్చి, ఏప్రిల్‌లలో భారతదేశం, పాకిస్తాన్‌లో వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు 30 రెట్లు పెరిగింది. ఇది ఏడాదికేడాది మరింతగా పెరుగుతుందని చెబుతోందా నివేదిక