Bull Arrest : కోడి పందెల్లో దొరికాయని కాళ్లను అరెస్ట్ చేయడం చూశాం... అలాగే ఇతర జంతువులనూ సెల్‌లో పెట్టడం చూశాం.. అయితే మన దగ్గర ఇలాంటి అరెస్టులు కేవలం.. వాటిని అడ్డం పెట్టుకుని నేరపూరిత గేంబ్లింగ్‌కు పాల్పడ్డారని కేసులు పెట్టడం ద్వారానే అదుపులోకి తీసుకుంటారు. తర్వాత ఎవరికి వారివి ఇచ్చేస్తారు. కానీ కొన్నిదేశాల్లో చట్టాలు అలా ఉండవు. వాటికి శిక్షలు కూడా విధిస్తారు. జైళ్లలో కూడా పెడతారు. అలాంటి ఓ ఘటన దక్షిణ సూడాన్‌లో జరిగింది.
దక్షిణ సూడాన్‌లో ఒక పొలం దగ్గర బండి లాగుతున్న ఎద్దు.. ఉన్నట్లుండి అక్కడే ఉన్న ఓ పన్నెండేళ్ల పిల్లాడిపై దాడి చేసింది. ఆ బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి పోలీసులకు చేరింది. బాలుడి హత్య జరిగింది... ఓ ఎద్దు హత్య చేసింది.. అనే విషయాలను మాత్రమే వారు తీసుకున్నారు. వెంటనే వెళ్లి క్రైమ్ సీన్‌ను హ్యాండోవర్ చేసుకున్నారు. బాలుడ్ని పోస్టుమార్టానికి పంపేశారు. ఏమీ ఎరుగనట్లుగా పక్కనే మేత మేస్తున్న ఎద్దుకు సంకెళ్లు వేసి పోలీస్ స్టేషన్‌కు లాక్కుపోయారు. అక్కడ కట్టేశారు.
ఆ ఎద్దును అరెస్టు చేసి రూంబేక్ సెంట్రల్ కౌంటీ పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. పిల్లాడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లామని అది పూర్తయిన తర్వాత అంత్యక్రియల కోసం కుటుంబానికి అప్పగించేశామని పోలీసులు ప్రకటించారు. ఇప్పుడు హత్యా నేరం కింద ఆ అవును కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని ప్రకటించారు. దక్షిణ సూడాన్ చట్టాల ప్రకారం హత్య ఎవరు చేసినా హత్యే. అందుకే బుల్ ఇప్పుడు జైలు శిక్షకు గురవబోతోంది.
ఎద్దుకు ఓ మూడేళ్ల వరకూ శిక్ష పడవచ్చని భావిస్తున్నారు. ఎద్దుకు జైలు శిక్ష ముగిసిన తర్వాత.. దాన్ని బాధితుల కుటుంబానికి అప్పగిస్తారు. అక్కడ ఎద్దుకు బాగానే కడుపు నింపుతారు. అలాంటి ఇబ్బంది రాదు. తెలియక చేసినా త.. తెలిసి చేసినా తప్పు తప్పే కాబట్టి.. ఎద్దుకూ జైలు శిక్ష తప్పడంలేదు.