Ukraine Kyiv Theater: రష్యా- ఉక్రెయిన్ యుద్దం మొదలై మూడు నెలలు దాటింది. ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికే రష్యా అధీనంలోకి ఉండగా మరికొన్ని నగరాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. అయితే ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో మూడు నెలల తర్వాత ఓ థియేటర్‌ తిరిగి తెరుచుకుంది. ప్రదర్శన మొదలుపెట్టిన తొలిరోజే మూడు షోలకు సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడుపోయాయి.


కోలుకుంటోన్న కీవ్


ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగిన తొలినాళ్లలో కీవ్‌ నగరంపై ఎక్కువగా దృష్టి పెట్టింది. అయితే రాజధాని కీవ్‌పై రష్యా దాడులను ఉక్రెయిన్ బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి. దీంతో రష్యా బలగాలు వెనక్కి వెళ్లిపోయాయి. అనంతరం కీవ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. నగరంలో రోజువారీ కార్యకలాపాలు కూడా మొదలయ్యాయి.


సినిమా థియేటర్లు తిరిగి తెరుచుకుంటున్నాయి. కీవ్‌ శివారులోని పొదిల్‌లో ఉన్న ఓ థియేటర్‌ కూడా ఇటీవల ప్రదర్శనను మొదలుపెట్టింది. యుద్ధం కొనసాగుతున్న వేళ ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారా అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ తొలిరోజే హౌస్‌ఫుల్ అయ్యాయి.


రష్యా భీకర యుద్ధం






తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతం 97 శాతానికి పైగా తమ నియంత్రణలోకి వచ్చిందని రష్యా మంగళవారం ప్రకటించింది. ముఖ్యంగా లుహాన్స్‌క్‌ ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్టు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగూ చెప్పారు. మరోవైపు కోల్పోయిన ప్రతి అంగుళాన్నీ తిరిగి స్వాదీనం చేసుకుంటామని ఉక్రెయిన్ ప్రకటించింది.


మరోవైపు, రష్యా కుబేరుడు రోమన్‌ అబ్రమోవిచ్‌కు చెందిన రెండు లగ్జరీ జెట్‌ విమానాలను అమెరికా స్వాధీనం చేసుకుంది. అలాగే 32.5 కోట్ల డాలర్లు చేసే అతి విలాసవంతమైన పడవ అమెడాను కూడా జప్తు చేసుకుంది. ఇప్పటికే ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఆయుధాలను అందిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ మేరకు బైడెన్ ప్రకటించారు.


Also Read: Prophet Remarks Row: భారత్‌కు ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా వార్నింగ్- కీలక నగరాల్లో దాడులు చేస్తామని లేఖ


Also Read: Delhi: పార్కింగ్ ఏరియాలో చెలరేగిన మంటలు- 10 కార్లు, 80 ఈ- రిక్షాలు దగ్ధం