ABP  WhatsApp

Elon Musk Twitter: ట్విట్టర్‌పై ఓ కన్నేసి ఉంచాం- మస్క్ స్పీడుకు వైట్ హౌస్ బ్రేకులు!

ABP Desam Updated at: 29 Nov 2022 05:40 PM (IST)
Edited By: Murali Krishna

Elon Musk Twitter: ట్విట్టర్‌లో ఏం జరుగుతుందో అన్నీ తాము గమనిస్తూనే ఉంటామని వైట్ హౌస్ ప్రకటించింది.

మస్క్ స్పీడుకు వైట్ హౌస్ బ్రేకులు!

NEXT PREV

Elon Musk Twitter: ట్విట్టర్‌ను టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk)టేకోవర్ చేసిన తర్వాత రోజుకో మార్పులు జరుగుతున్నాయి. లేఆఫ్‌లు, బ్లూ టిక్, వాక్ స్వాతంత్రం అంటూ మస్క్ రోజుకో ట్వీట్ చేస్తున్నారు. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్ష కార్యాలయం శ్వేతసౌధం (వైట్ హౌస్) కీలక వ్యాఖ్యలు చేసింది. ట్విట్టర్ కార్యకలపాలపై తమ నిఘా ఎప్పుడు ఉంటుందని తెలిపింది. 



ట్విట్టర్ కార్యకలాపాలపై మేము కచ్చితంగా నిఘా ఉంచుతాం. సోషల్ మీడియా విషయంలో మేము ఎప్పుడు స్పష్టంగానే వున్నాం. దుష్ప్రచారం, హింసను ప్రేరేపించే అంశాల విషయంలో బాధ్యత ఆ సంస్థలదే. మనం చూస్తున్నాం వాళ్లు చర్యలు తీసుకుంటున్నారు. ట్విట్టర్లో ఎం జరుగుతుందో, మీరంతా ఏం చెబుతున్నారో మేమూ చూస్తూనే ఉన్నాం. వినియోగదారుడి వల్ల హింస, ముఖ్యంగా రాజ్యాంగ సంస్థలపై దాడి జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. మేము ట్విట్టర్‌పై పర్యవేక్షణ ను కొనసాగిస్తాం.                                              -    శ్వేతసౌధం అధికార ప్రతినిధి


మస్క్ ట్వీట్


ఈ మంగళవారం ట్విట్టర్ అధినేత ఎలాన్ మాస్క్ ఆసక్తికర ట్వీట్ చేసారు. ట్వీట్‌లో మాస్క్ ఇది భవిష్యత్ నాగరికత కోసం జరుగుతున్న యుద్దం అని పేర్కొన్నారు.











అమెరికాలో కూడా వాక్ స్వాతంత్రం కోల్పోతే ముందు ముందు చూసేది దౌర్జన్యం మాత్రమే. వాక్ స్వాతంత్రం అణిచివేతపై ట్విట్టర్ ఫైల్స్‌ను ట్విట్టర్లో త్వరలోనే ప్రచురిస్తాం. ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రజలు అర్హత ఉంది.                             - ఎలాన్ మస్క్, ట్విట్టర్ చీఫ్


మస్క్ చేపట్టకముందు ట్విట్టర్‌లో ఫ్రీ స్పీచ్‌పై కాస్త కఠినంగా ఆంక్షలు ఉన్నాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఏకంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్‌ ఖాతానే సస్పెండ్ చేసింది ఆ సంస్థ.


Also Read: Odisha News: జడ్జినే కత్తితో పొడవబోయిన దుండగుడు- విచారణ ఆలస్యమైందని!

Published at: 29 Nov 2022 05:36 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.