UK-China Relations: చైనాపై బ్రిటన్ ప్రధాని రిషి సునక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్- చైనా మధ్య స్వర్ణ యుగంగా పిలిచిన ఆ నాటి సంబంధాలు ఇక ముగిశాయన్నారు. యూకే విలువలు, ఆసక్తులపై చైనా వ్యవస్థాగత సవాలు విసరుతోందని రిషి మండిపడ్డారు. చైనాలో మానవ హక్కుల అణచివేత జరుగుతోందని విమర్శించారు.లండన్‌లో సోమవారం జరిగిన సమావేశంలో తొలిసారి విదేశాంగ విధానంపై రిషి ప్రసంగించారు.
కొవిడ్ ఆంక్షలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను కవర్ చేస్తున్న బీబీసీ జర్నలిస్ట్‌ను చైనా పోలీసులు అరెస్ట్ చేసి దాడి చేసిన ఘటనను ఖండిస్తూ రిషి సునక్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆర్థిక స్థిరత్వం, వాతావరణ మార్పు వంటి అంతర్జాతీయ విషయాల్లో చైనా అందించిన ప్రాముఖ్యతను మరచిపోలేదని రిషి అన్నారు.
భారత్‌తో దోస్తీ
మరోవైపు భారత్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి తమ దేశం కట్టుబడి ఉందని రిషి సునాక్ తెలిపారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంతో సన్నిహిత సంబంధాలను పెంచుకోవాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని తమ నిర్ణయం ఉండనున్నట్లు పేర్కొన్నారు.
గుడ్‌న్యూస్
ఇటీవల జీ20 సదస్సు వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ.. బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఇరువురు కాసేపు మాట్లాడుకున్నారు. ఇది జరిగిన తర్వాత భారతీయులకు బ్రిటన్ ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. యూకే రావాలనుకునే భారత యువ నిపుణులకు ఏటా 3 వేల వీసాలు అందిస్తామని బ్రిటన్ తెలిపింది.
ఈ సరికొత్త వీసా పథకానికి యూకే ప్రధాని రిషి సునాక్ ఆమోదం తెలిపారు. ఈ పథకం కింద భారత్‌కు చెందిన 18-30 ఏళ్ల డిగ్రీ విద్యావంతులకు ఏటా 3 వేల వీసాలు అందజేయనుంది బ్రిటన్ ప్రభుత్వం. ఈ వీసా ద్వారా యూకేకు వచ్చి రెండేళ్ల వరకు చదువుకోవడం, ఉద్యోగం చేసుకునేందుకు వీలుంటుంది.
Also Read: Monkeypox New Name: 'మంకీపాక్స్' పేరు మార్చిన WHO- ఇక ఇలానే పిలవాలి!