ABP  WhatsApp

Odisha News: జడ్జినే కత్తితో పొడవబోయిన దుండగుడు- విచారణ ఆలస్యమైందని!

ABP Desam Updated at: 29 Nov 2022 05:21 PM (IST)
Edited By: Murali Krishna

Odisha News: కేసుల విచారణ ఆలస్యమవుతుందని ఓ నిందితుడు ఏకంగా జడ్జినే కత్తితో పొడవబోయాడు.

జడ్జినే కత్తితో పొడవబోయిన దుండగుడు!

NEXT PREV

Odisha News: ఏదైనా నేరం చేస్తే విచారణ కోసం కోర్టుకు హాజరుకావాలి. కానీ ఓ వ్యక్తి ఏకంగా కోర్టులో న్యాయమూర్తికే కత్తి చూపించాడు. విచారణ ఆలస్యమవుతుందని జడ్జిని కత్తితో పొడవబోయాడు. ఒడిశాలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.


ఇదీ జరిగింది


గంజాం జిల్లాలో సోమవారం ఈ ఘటన జరిగింది. విచారణ ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి కోర్టులోనీ జడ్జి ఛాంబర్లో కత్తితో సబ్ డివిజనల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్‌ను బెదిరించాడు. దీంతో నిందితుడ్ని అరెస్టు చేసిన పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్‌లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.


భగవాన్ సాహు అనే వ్యక్తి దోపిడి, దాడి, హత్యా ప్రయత్నం, మహిళలపై దుష్ప్రవర్తన వంటి కేసుల్లో నిందితుడిగా జైల్లో ఉంటున్నాడు. వాటికి సంబంధించి విచారణకు హాజరు అవడానికి ఈ సోమవారం కోర్టుకు వచ్చాడు. తన కేసుల విచారణలో జరుగుతున్న జాప్యంతో తీవ్ర ఆక్రోశానికి గురై మధ్యాహ్నం తన ఛాంబర్‌లో పని చేసుకుంటున్న జడ్జి దగ్గరికి వెళ్శి నిందితుడు కత్తితో బెదిరించాడు. 


అకస్మాత్తుగా జడ్జి అరుపులను విన్న లాయర్లు, కోర్టు సిబ్బంది ఛాంబర్ దగ్గరికి వెళ్ళి చూడటంతో నిందితుడ్ని కత్తితో చూసి ఆశ్చర్యపోయారు, నిందితుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఘటన సమయంలో అక్కడే ఉన్న ఓ లాయర్ దీని గురించి వెల్లడించారు.



కోర్టు రూంలో ఉన్న మేము అకస్మాత్తుగా జడ్జి అరుపులను విన్నాం, ఆ వ్యక్తి కత్తి పట్టుకొని ఉండటం మమల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయుధాలతో నేరస్థులు కోర్టులకు వస్తున్నారంటే రక్షణ చర్యలు ఎంత బలహీనంగా ఉన్నాయి అన్నది అర్థం అవుతుంది.                         -   లాయర్, ప్రత్యక్ష సాక్షి

Published at: 29 Nov 2022 05:21 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.