Kim Gets Emotional:
కన్నీళ్లు పెట్టుకున్న కిమ్..
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ (Kim Jong Un) అంటే ఓ నియంత. అనుకున్నది సాధించుకోడం కోసం ఎంతకైనా తెగిస్తారు. జాలి, దయ, కరుణ ఇవేమీ ఉండవు. కిమ్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ఈ మాటలే వినిపిస్తాయి. కానీ...అంతగా గడగడలాడించే కిమ్ కూడా చిన్న పిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్వడం ఎప్పుడైనా చూశారా..? కిమ్ ఏంటి..? కన్నీళ్లు పెట్టుకోవడమేంటి..? అని ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగానే జరిగింది. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ ఉన్నట్టుండి భావోద్వేగానికి గురయ్యారు కిమ్. నార్త్ కొరియాలో బర్త్ రేట్ బాగా తగ్గిపోతోందట. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూనే ఎమోషనల్ అయ్యారు. మహిళలు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని రిక్వెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేకపోయిన కిమ్ ఉన్నట్టుండి ఏడ్చారు. ఆ తరవాత కన్నీళ్లు తుడుచుకుంటూ అసలు విషయం చెప్పారు.
"దేశంలో బర్త్ రేట్ బాగా తగ్గిపోయింది. ఇది చాలా ఆందోళనకరమైన విషయం. పిల్లల్ని సరిగ్గా చూసుకోవడం అనేది మనందరి కనీస బాధ్యత. ఈ విషయంలో మహిళలందరికీ మనం సహకరించాలి. దేశాన్ని మరింత శక్తిమంతంగా తయారు చేసేందుకు సహకరిస్తున్న తల్లులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ గురించి, దేశం గురించి ఆలోచించిన ప్రతిసారీ ఓసారి అమ్మలందరినీ గుర్తు చేసుకుంటాను"
- కిమ్ జాంగ్ ఉన్, ఉత్తరకొరియా అధ్యక్షుడు
కారణమిదే..
United Nations Population Fund అంచనాల ప్రకారం..2023 నాటికి ఉత్తరకొరియాలో యావరేజ్ ఫర్టిలిటీ రేట్ (North Korea Fertility Rate) 1.8 కి పడిపోయింది. మరి కొన్ని దశాబ్దాల్లో ఇది మరింత తగ్గిపోయే ప్రమాదముందని వెల్లడించింది. అయితే...నార్త్ కొరియాకి పొరుగున్న దేశాల్లో మాత్రం ఈ ఫర్టిలిటీ రేటు కాస్త మెరుగ్గా ఉంది. ఉత్తర కొరియాలో పీడియాట్రిషియన్‌ల సంఖ్య తగ్గిపోతుండడం ఫర్టిలిటీ రేటు తగ్గిపోవడానికి ఓ కారణంగా చెబుతున్నారు. ప్రస్తుతానికి నార్త్ కొరియా జనాభా 2.5 కోట్లు. ఈ మధ్య కాలంలో ఇక్కడ ప్రకృతి విపత్తులు పెరుగుతున్నాయి. ఫలితంగా పంట నష్టం జరుగుతోంది. ఆహార కొరత ఏర్పడుతోంది. పిల్లల్ని పోషించడానికి తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అందుకే...అసలు పిల్లలే వద్దనుకుంటున్నారు. ఈ కారణంగా చాలా వరకూ ఫర్టిలిటీ రేటు పడిపోయింది. మహిళలు ఈ విషయంలో ఆలోచించాలని, బర్త్ రేట్ పెంచేలా సహకరించాలని కోరుకున్నారు కిమ్. ఎప్పుడూ సీరియస్‌గా ఉండే ఆయన..ఇలా ఏడవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సోషల్ మీడియాలో ఈ వీడియోకి రకరకాల కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
Also Read: Websites Blocked: పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరిట భారీ మోసం, 100 వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసిన కేంద్రం