Gurpatwant Singh Video:


గురుపత్వంత్ సింగ్ వార్నింగ్..


ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ (Gurpatwant Singh Pannun Video) విడుదల చేసిన ఓ వీడియో సంచలనమవుతోంది. డిసెంబర్ 13వ తేదీ లోపు పార్లమెంట్‌పై దాడి చేస్తానని హెచ్చరించాడు. తనను చంపాలని చూసినందుకు ఇలా పగ తీర్చుకుంటానని ఇండియాకి వార్నింగ్ ఇచ్చాడు. 2001లో భారత పార్లమెంట్‌పై దాడి (Gurpatwant Singh Pannun Attack) జరిగింది. సరిగ్గా 22 ఏళ్ల తరవాత మరోసారి ఇలాంటి బెదిరింపులే రావడం అలజడి సృష్టిస్తోంది. పార్లమెంట్‌పై దాడి చేయడమే కాదు. ఢిల్లీని మరో ఖలిస్థాన్‌గా మార్చేస్తామని కూడా బెదిరించాడు. కొన్ని భారతీయ సంస్థలు తనను చంపాలని చూసేందుకు కుట్ర చేశాయని, కానీ ఫెయిల్ అయ్యాయని అన్నాడు. పార్లమెంట్‌పై దాడితోనే గట్టి బదులు చెబుతానని తేల్చి చెప్పాడు. శీతాకాల సమావేశాలు (Parliament Winter Session) ప్రారంభమైన నేపథ్యంలో ఈ హెచ్చరికలు రావడంపై భారత్ అప్రమత్తమైంది. డిసెంబర్ 22 వరకూ ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. భద్రతా బలగాలు హై అలెర్ట్ ప్రకటించాయి. పాకిస్థాన్‌ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ ISI పన్నున్‌కి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చినట్టు అంచనా వేస్తున్నాయి. ఆ సంస్థకి చెందిన కశ్మీర్‌ టు ఖలిస్థాన్ డెస్క్...భారత్‌కి వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు కుట్ర చేస్తున్నట్టు తెలిపాయి.


చంపేందుకు కుట్ర..? 


గత నెల The Financial Times కీలక విషయాలు వెల్లడించింది. అమెరికా భద్రతా అధికారులు గురుపత్వంత్ సింగ్‌ని చంపేందుకు ప్లాన్ చేశాయని రిపోర్ట్ చేసింది. అంతే కాదు. ఈ కుట్రలో భారత్‌ భాగస్వామ్యం ఉందంటూ ఆరోపణలొచ్చాయి. అమెరికాకి చెందిన  Sikhs for Justice (SFJ)కి చీఫ్‌గా ఉన్నాడు గురుపత్వంత్. భారత్‌ సెక్యూరిటీ ఏజెన్సీలు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌గా ఇప్పటికే ప్రకటించాయి. భారత్‌కి చెందిన నిఖిల్ గుప్తా (Nikhil Gupta) ఓ ఉద్యోగితో కలిసి గురుపత్వంత్ సింగ్ పన్నున్‌ని చంపేందుకు కుట్ర చేసినట్టు ఇటీవలే అమెరికా సెక్యూరిటీ ఏజెన్సీలు గుర్తించాయి. ఆ వ్యక్తిని అరెస్ట్ చేశాయి. కోర్టులో ఇందుకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్‌ని కూడా సబ్మిట్ చేశాయి.