Guppedantha Manasu December 6th Episode (గుప్పెడంతమనసు డిసెంబరు 6 ఎపిసోడ్)


మహేంద్రని ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోమని ఫణీంద్ర చెప్పినా కానీ..వద్దు అన్నయ్యా ఇక్కడే నీకు తోడుగా ఉంటానంటాడు. మనిద్దరం ఇక్కడే ఉందాం ధరణి-దేవయానిని ఇంటికి పంపించేద్దాం అంటాడు. ఫణీంద్ర చెప్పినా కానీ దేవయాని వినదు. ధరణి చాలా దూరం నుంచి వచ్చింది ఇంటికి తీసుకెళితే రెస్ట్ తీసుకుంటుంది అంటాడు
దేవయాని: నేను వెళ్లిపోతే శైలేంద్ర కండిషన్ బయటపడుతుంది..నేను ఇక్కడే ఉండి వాడికి బాలేదని మ్యానేజ్ చేయాలని మనసులో అనుకుంటుంది. నేను ఇక్కడే ఉంటానంటుంది...
అప్పుడు ఫణీంద్ర..మహేంద్రని, వసుధారని వెళ్లిపొమ్మని చెబుతాడు...సరే అని మహేంద్ర బయలుదేరుతాడు.. ఇంతలో రిషి ఏడని ఫణీంద్ర అడగడంతో ఫోన్ కూడా కలవడం లేదు, ఎక్కడికి వెళ్లాడో తెలియడం లేదంటాడు మహేంద్ర.
ఆ తర్వాత మహేంద్ర-వసుధార ఇద్దరూ ఇంటికి వెళుతూ రిషికి కాల్ ట్రై చేస్తారు...ఫోన్ కలవకపోవడంతో టెన్షన్ పడతారు. ఏంకాదులే అని మహేంద్ర చెప్పేందుకు ప్రయత్నిస్తాడు కానీ... వసుధార మాత్రం మరింత భయపడుతుంది.
వసు: ఇన్నాళ్లూ ఆధారం దొరకలేదన్నారు..ఇప్పుడు ఆధారం దొరికింది..దీనికి మించిన ఇంపార్టెంట్ పని ఇంకేముంది ...
మహేంద్ర: ఇన్నాళ్లూ మంచి అనుకున్న వ్యక్తిగురించి బయటపడడంతో తట్టుకోలేక ఎక్కడికో వెళ్లి ఉంటాడు..నువ్వు కంగారుపడకు రిషి వచ్చేస్తాడులే అని చెబుతాడు..
ఇంటి దగ్గర కారు దిగేసరికి ఎదురుగా అనుపమ ఉంటుంది
మహేంద్ర: నువ్వేంటి ఇక్కడ
అనుపమ: ఏం ఉండకూడదా..ఏమైనా నిబంధనలు ఉన్నాయా..నువ్వు రావొద్దని చెప్పింది హాస్పిటల్ కే కదా...శైలేంద్రకి ఎలా ఉంది
మహేంద్ర: వాడికేం బాగానే ఉన్నాడని అంటాడు
లోపలకి పిలవరా అంటే..పనేం లేదుగా అని మహేంద్ర అనడంతో..వసుధార మాత్రం లోపలకు రండి అని పిలుస్తుంది
అనుపమ: నువ్వు చాలా విషయాల్లో ఇంప్రెసివ్ గా అనిపిస్తావు..కానీ ఆ ఎండీ సీటుకి మాత్రం నువ్వు తగవు అనిపిస్తోంది
మహేంద్ర: అందుకే నిన్ను రావొద్దన్నాను...ఎదుటివాళ్ల ఫీలింగ్స్ తో నీకు అవసరం లేదు కదా
అనుపమ: నేను ఏం చేశానని క్లాస్ వేస్తున్నావ్
మహేంద్ర: నీకు చెప్పినా అనవసరం..రా వసుధారా అంటాడు..
కాఫీ కూడా ఇవ్వవా అని అనుపమ అంటే...సారీ మేడం నేను ఏదో ఆలోచనలో ఉన్నాను తీసుకొస్తానంటుంది... 
మీరు బాగా అలసిపోయి ఉన్నారు...నేనే ఇస్తానంటుంది అనుపమ...నన్ను గెస్ట్ లా ఫీలవొద్దు..నన్ను మీ ఇంట్లో మనిషి అనుకోవచ్చు లేదంటే సంబంధం లేదని అనుకోవచ్చు...మీరు కూర్చోండి నేనే కాఫీ తీసుకొస్తానంటుంది అనుపమ...
మళ్లీ రిషికి కాల్ ట్రై చేస్తానంటుంది...ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో మళ్లీ ఆలోచనలో పడతారు...


Also Read: రిషి ఎక్కడికి వెళ్లాడో క్లారిటీ వచ్చేసింది - అనుపమ గురించి మహేంద్ర టెన్షన్ - శైలేంద్ర అరాచకత్వం పీక్స్!


అటు శైలేంద్ర డ్రామా కొనసాగుతోంది..ఏడుస్తున్న ధరణిని ఓదార్చేందుకు ఓపిక తెచ్చిపెట్టుకున్నట్టు మాట్లాడుతూ లేని ప్రేమ నటిస్తాడు. నువ్వే నా ఆయుధం...నన్ను ఇక ఎవ్వరూ ఏమీ చేయలేరు అనుకుంటాడు. 
ధరణి: అసలు ఆ రౌడీలు ఎవరు..మిమ్మల్ని ఎవ్వర్నీ వదిలిపెట్టం అని ఎందుకన్నారు..
శైలేంద్ర: వాళ్లు కాలేజీకి సంబంధించిన శత్రువులు ఎవరుంటారు
ధరణి: కాలేజీని సొంతం చేసుకోవాలని చూసింది మీరు తప్ప ఎవ్వరూ లేరు..కాలేజీకి మీకన్నా శత్రువులు ఎవరుంటారు..
శైలేంద్ర: నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అని డ్రామా స్టార్ట్ చేస్తాడు
ధరణి: నేను మిమ్మల్ని నమ్ముతున్నాను...కానీ వాళ్లు ఎవరో ఏంటో...
శైలేంద్ర: వాళ్లు ఎవరైనా కానీ కచ్చితంగా వదిలిపెట్టను..నేను కోలుకున్నాక వాళ్లని నీ కళ్లముందు నిలబెడతాను..నువ్వే వాళ్లకి తగిన శిక్ష వేద్దుగానివి. నా ప్రాణం పోతున్న సమయంలో కూడా నీకేమైనా అవుతుందా అనే భయపడ్డాను...
ధరణి: ఆ సిట్యుయేషన్ గుర్తు చేసుకుంటే చాలా భయం వేస్తోంది...మీకేమైనా అయితే నేను ఏమైపోయేదాన్నో...
శైలేంద్ర: నువ్వు నా పక్కనుండగా నాకేం కాదు ధరణి...  నువ్వెళ్లు నేను నిద్రపోతాను అని చెప్పి ధరణిని పంపించేసి క్రూరంగా నవ్వుకుంటాడు


Also Read: డైలమాలో రిషి - క్లారిటీ ఇచ్చేందుకు వసు ప్రయత్నం - మొత్తం మార్చేసిన శైలేంద్ర!


మరోవైపు వసుధార రిషి కోసం టెన్షన్ పడుతూనే ఉంటుంది. అందరకీ కాల్స్ చేసి రిషి గురించి ఎంక్వరీ చేస్తుంటుంది...అనుపమ కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. తను తర్వాత తాగుతుందని చెబుతాడు మహేంద్ర..వసుధార వరుసగా కాల్స్ చేస్తుంటుంది.. ఈ టైమ్ వరకూ హాస్పిటల్లోనే ఉన్నారా, శైలేంద్ర బాగానే ఉన్నాడా అని వరుస ప్రశ్నలు వేస్తుంటుంది అనుపమ...నేను ఇప్పుడు ఏమీ మాట్లాడలేను అనేస్తాడు మహేంద్ర.
అనుపమ: ఇప్పుడు నేను నీకు ప్రశాంతత లేకుండా చేశానా ఏంటి...వసుధారా కాఫీ చల్లారిపోతోంది రా అని పిలుస్తుంది.. ముందు కాఫీ తాగు ఏదైనా పని ఉంటే తర్వాత చూసుకోవచ్చు
వసు: సర్ ఫోన్ స్విచ్చాఫ్ వస్తోంది...ఎవ్వర్ని అడిగినా తెలియదు అనే చెబుతున్నారు
ఎవరి ఫోన్ అని అనుపమ అడిగితే..రిషి అని చెబుతాడు మహేంద్ర
వసు: పనిమీద వెళ్తాను అన్నారు కానీ ఎక్కడికి వెళ్లారో, ఎందుకు వెళ్లారో, ఏ పనిమీద వెళ్లారో అర్థంకాలేదు...
అనుపమ: ఈ మధ్య మీతో మాట్లాడలేదా
వసు: లేదు మేడం..స్విచ్చాఫ్ అయితే కార్లో ఛార్జింగ్ ఉంది కదా
అనుపమ: మీతోపాటూ హాస్పిటల్ కి వచ్చాడా
వసు: వచ్చారు కానీ లోపలకు రాలేదు..నేను కాల్ చేస్తే నాకు పని ఉంది వచ్చేస్తానని మెసేజ్ చేశారని చెబుతుంది
అయితే ఆ మెసేజ్ కూడా రిసి చేశాడని నమ్మకంగా చెప్పలేం అని అనుపమ అనగానే వసుధారలో టెన్షన్ పెరుగుతుంది...
నువ్వు ఎందుకు డల్ గా ఉన్నారో అర్థం కాక ఇలా మాట్లాడాను అని చెబుతుంది అనుపమ... నువ్వేంటి ఇంత కూల్ గా ఉన్నావ్ అని మహేంద్రని అడుగుతుంది
మహేంద్ర: నేను కూల్ గా లేనంటూ క్లాస్ వేస్తాడు
అనుపమ: పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వండి ..ప్రోపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు..కచ్చితంగా రిషి ఏమయ్యాడో తెలుస్తుంది...