Trinayani Telugu Serial Today Episode

విక్రాంత్, సుమన తమ గదిలో గొడవ పడుతుంటారు. సుమన నయని మీద నోరు పారేసుకుంటే విక్రాంత్ తిడతాడు. ఇక సుమన తన దగ్గర మూడు కోట్ల విలువైన నగలు ఉన్నాయని అంటే.. అవి దేనికీ ఉపయోగపడవు అని అన్నింటికంటే ముందు తినడానికి తిండి.. తాగడానికి నీరు ముఖ్యమని వాటిని సంపాదించుకో అని అంటాడు. 

సుమన: కొన్ని అడ్డంకులు తొలగించుకుంటే అందరి కన్నా ముందు స్థాయిలో ఉండొచ్చని అర్థమైందివిక్రాంత్: అడ్డంకులు అంటే సమస్యలు అనే కదా.. మనుషులే అడ్డు అనుకొని వాళ్లని తొలగించాలి అనే దుర్మార్గమైన పనులు మాత్రం చేయకు.సుమన: మనసులో.. పెద్ద బొట్టమ్మ మనిషి అయితే కదా.. మీరు బాధ పడిపోడానికి.. దాన్ని తప్పిస్తే ఇక ఉలూచి నన్ను వదిలి ఎక్కడికీ పోదు.. అప్పుడు పాపని అడ్డుపెట్టుకొని ఆస్తి ఎలా సంపాదించాలో నాకు బాగా తెలుసువిక్రాంత్: హలో చెప్పింది అర్థమైందా.. అయినా పొగరెక్కిన మనిషికి ఇంకాం ఏం అర్థమవుతుంది.

హాల్‌లో సుమన అరటి ఆకు పెట్టి అందులో భోజనం వడ్డిస్తుంది. ఇక అప్పుడే పావనామూర్తి, హాసిని, డమ్మక్క అక్కడికి వస్తారు. ఇక మంచి ఆకలి మీద ఉన్న పావనామూర్తి సుమన తన కోసమే వడ్డించింది అని ఆ ఆకు ముందు కూర్చొంటారు. దీంతో సుమన సీరియస్ అయి ఆయన్ను పావనాను.. భోజనం తినకుండా లేపేస్తుంది. ఇంట్లో అందరూ వద్దు అని చెప్పినా వినదు. 

నయని: సుమన మతి లేని పనులు చేయకుసుమన: అన్నం పెట్టడం మంచి పనే కదా అక్కవిశాల్: అన్నం ముందు కూర్చొన్నవాళ్లని తినకుండా లేపడం పాపంవిక్రాంత్: ఆ మాత్రం ఇంకితం ఉంటే బాగుండేది బ్రోవల్లభ: ఓరేయ్ తమ్మి.. ఇవాళ కార్తీక పౌర్ణమి కదా మిగతా ఆడవాళ్లకు రాని ఆలోచన నీ భార్యకు వచ్చిందేమో.. భర్తకు తనే స్వయంగా వచ్చిండి తృప్తిగా తినే వరకు వడ్డించాలి అని అనుకుందేమోహాసిని: ఆ కోరిక మీది ఏమో కదావల్లభ: హా కాదు.. నాకు నువ్వు టిఫెన్ కూడా పెట్టవు అని తెలుసు కదావిశాల్: ఒక్క నిమిషం ఆగు అన్నయ్య.. సుమన మామయ్యని తిననివ్వలేదు.. విక్రాంత్‌ని కూర్చొమని చెప్పలేదు.. నువ్వా తినడం లేదు.. మరి ఎవరి కోసం ఈ భోజనంసుమన: పెద్ద బొట్టమ్మ కోసం బావగారునయని: ఏంటి నువ్వు పెద్దమ్మకి భోజనం పెట్టాలని అనుకున్నావా..హాసిని: అది కూడా నీ చేతులతోపావనా: ఆమెను చూస్తే అరుస్తావ్.. ఆకలి తీరుస్తావా ఎందుకమ్మ అబద్ధం చెప్తావ్సుమన: మీరు అలాగే అంటూ ఉండండి.. ఓ పెద్ద బొట్టమ్మ రా భోజనం చేద్దువు గాని.. కూర్చొ పెద్దమ్మ.. మనిషి రూపంలో ఉన్నావు కాబట్టి భోజనం చేయగలవు కాబట్టి ఇవన్నీ చేశాను. పాము రూపంలో ఉంటే పాలు మాత్రమే పోసేదాన్ని.. కార్తీకపౌర్ణమి రోజు నిండు ముత్తయిదువు అయిన నీకు భోజనం పెట్టి చీర, గాజులు, తాంబూలం పెట్టాలి అనుకున్నప్పుడు దోసెడు పాలు పోస్తే ఏం బాగుంటుంది చెప్పు అందుకే ఇలా.. తిను పెద్దమ్మపెద్దబొట్టమ్మ: పెద్ద బొట్టమ్మ అని ప్రేమగా పిలిచినా.. పెద్దమ్మ అని వరస కలిపి పిలిచినా సంతోషంగా బదులు ఇస్తాను. పున్నమి నాగునైన నాకు కడుపునిండా భోజనం పెట్టి వాయినం ఇస్తా అంటే కాదు అనలేకపోయానుసుమన: అది కూడా నా బిడ్డ అని నువ్వు పిలిచే ఉలూచి సమక్షంలో తినడం నీకు ఇంకా సంతోషం కదాపెద్దబొట్టమ్మ: సరే నువ్వు తిను.. నేను చీర తాంబూలం తెస్తానునయని: ఒక్క నిమిషం పెద్దమ్మ.. వల్లభ: తినడానికి కూర్చొన్న మామయ్యని ఆపితే తప్పు అన్నారు కదా.. ఇప్పుడు తినడానికి సిద్ధమైన పెద్దబొట్టమ్మని ఆపడం నేరం కాదాహాసిని: చెల్లి ఏమైందినయని: నాకు అనుమానంగా ఉంది అక్క.. పెద్ద బొట్టమ్మ తినే భోజనం మీదసుమన: ఏంటి అక్క అంటే నేను అందులో విషం కలిపి ఉంటాననా.. నయని: పెద్దమ్మ నువ్వు తినబోయే తొలి ముద్దని నాకు ఇవ్వు నేను తిన్నాక నువ్వు తిందువు గానిపెద్దబొట్టమ్మ: ఏంటి నయనమ్మా అలా అడుగుతున్నావ్నయని: మా చెల్లిలి మీద అనుమానం అని కాదు గాని.. ఎందుకో తొలి ముద్ద నేను తినాలి అనుకుంటున్నానువిశాల్: నయని రిస్క్ తీసుకోకుసుమన: మా అక్క అనుమానం కూడా తీరాలి కదా పెట్టండి

పెద్దబొట్టమ్మ మొదటి ముద్దని నయనికి ఇస్తుంది. నయని తింటుంది. ఇక పప్పుతో కూడా తినపించమని సుమన వడ్డిస్తుంది. విశాల్: అక్కర్లేదు నయని ఒక్క ముద్ద మాత్రమే అడిగిందిసుమన: మనసులో.. మా అక్క ఇలా చేస్తుంది అని తెలిసే ముందు పప్పు వేయలేదు బావగారు.. ఇప్పుడు పెద్ద బొట్టమ్మకు వేసిన పప్పును అన్నంలో కలుపుకొని తింటుంది. అని అనుకొని తాంబూలం తీసుకురావడానికి వెళ్తుంది. నయని: మనసులో..  గాయత్రీ దేవి ఫొటో చూస్తూ.. అమ్మగారు మా చెల్లిలో ఇంత మార్పు వచ్చింది అంటే నమ్మలేకపోతున్నా. మనుషులకు ఆపద వస్తే గ్రహించగలను కానీ సర్ప జాతి అయిన పెద్ద బొట్టమ్మ విషయంలో అనుమానించ గలను కానీ ఆధారం సంపాదించలేను. కీడు అయితే జరగదు కదా.. అను నయని అంటే అప్పుడు పెద్ద గాలి దుమారం రేగుతుంది. దీంతో పెద్ద బొట్టమ్మ తినలేకపోతుంది. మరోవైపు భోజనంలో పాము కుభసం(పాము పొర) పడుతుంది. దీంతో తినకుండా పెద్ద బొట్టమ్మ లేచేస్తుంది. 

సుమన: బల్లి పడినట్లు చెప్తావ్ ఏంటి అక్క.. దాన్ని పక్కకు పడేసి తినేస్తుంది.పెద్దబొట్టమ్మ: ఏం అనుకోకు సుమన భోజనం చేసేటప్పుడు కుభసం పడితే మేము మరుసటి రోజు వరకు పచ్చి మంచి నీళ్లు కూడా తాగము. విశాల్: అరే సుమనకు నీ మీద ఎంత కోపం ఉన్నా కార్తీక పౌర్ణమి రోజు నీకు భోజనం పెట్టాలి అనుకుంది అంటే మంచి పని చేసింది అనుకున్నాం. హాసిని: సడెన్‌గా గాలి రావడంతో ఎక్కడో ఉన్న కుభసం అన్నంలో పడడంతో పెద్ద బొట్టమ్మ విరమించేసుకుందిసుమన: మనసులో.. ఛా.. చస్తుంది అంటే బతికిపోయింది.. అర్జెంట్‌గా దీన్ని ఇక్కడి నుంచి బయటకు పంపేయాలిడమ్మక్క: సుమన అనుకున్నది ఒకటి అయింది ఒకటి.. ఎవరైనా తిన్నాక తాంబూలం తీసుకుంటారు. నువ్వు తినకముందే తాంబూలం ఇచ్చి పుణ్యం కట్టుకో. సుమన: ఇవ్వకుండా ఎలా ఉంటాను తీసుకో పెద్దమ్మపెద్దబొట్టమ్మ: ఉలూచి మీ అమ్మ ఇచ్చిన చీర ఈ అమ్మకి నప్పుతుందా.. బాగుందా లేదా చెప్పు.. సుమన: నెలల పిల్ల బదులు ఏమిస్తుంది కానీ ఇక బయలుదేరు పెద్దమ్మపెద్దబొట్టమ్మ: వెళ్తాను సుమన. ఇలాగే నువ్వు ఆదరిస్తే అంతకన్నా ఆనందం ఉండదు. సుమన: సమయం సందర్భం రావాలి.. అది కూడా నేను పిలవాలి. అంతే కానీ ఎప్పుడు పడితే అప్పుడు రావొద్దు. నయని: అంత కఠినంగా చెప్పకూడదు చెల్లివిశాల్: ఆవిడ ఇంకా ఇక్కడే ఉంటే సుమన ముందులా మారిపోతుంది.. పెద్ద బొట్టమ్మ వెళ్లిపోతుంది.

మరోవైపు రాత్రి సమయంలో విశాల్ తమ ఇంటి ఆరు బయట బూతద్దంతో నేలను చూస్తూ ఉంటాడు. ఇంతో నయని అక్కడికి వస్తుంది. ఏమైంది అని అడుగుతుంది. దీంతో చూస్తే నీకు అర్ధమవుతుంది అని విశాల్ బదులిస్తాడు నయని చూస్తుంది. నయని: ఇవ్వండి.. పాము పాకినట్లు చారల అచ్చులు కనిపిస్తుంది బాబుగారువిశాల్: ఉలూచి అయితే కాదునయని: నాగయ్య వస్తే నాకు కనిపించేవాడు కదావిశాల్: పెద్ద బొట్టమ్మనేనయని: తాంబూలం తీసుకొని వెళ్లి పోయింది కదా బాబుగారువిశాల్: లేదు నయని.. నా గెస్ కరెక్ట్ అయితే తాను ఇక్కడే ఎక్కడో ఉండాలినయని: అవునా.. నాగులా పురం పెట్టెలో ఉన్న గవ్వలు ఈ ఇంట్లో ఉన్నంత వరకు తను మనందరికీ కనిపిస్తుంది అని చెప్పింది కదా. అప్పుడు ఇక్కడే ఉంటే కనిపిస్తుంది కదావిశాల్: అలా ఎలా కనిపిస్తుంది నయని.. పాము రూపంలో పాకుతూ ఉంటే.. నయని: భోజనం పెట్టి వాయినం ఇవ్వాలని సుమన అనుకున్నా అది జరగలేదు.. భోజనంలో కుభసం పడటం కంటే ముందు ఆహారంలో విషం పడింది బాబుగారు.. విశాల్: విషమా..నయని: అవును ఇలా చూడండి(అరటి ఆకు నల్లగా మారింది).. చూశారా సుమన దుర్మార్గం. విష ప్రయోగం జరిగింది అని అర్థం.. దురదృష్టం ఏంటి మనుషులకు వచ్చే ఆపద కనుక్కోగలను కానీ.. సర్పం అయిన పెద్దబొట్టమ్మకు వచ్చే ఆపద గుర్తించలేను. అప్పటికీ అనుమానం వచ్చింది. హాని జరుగుతుంది ఏమో అని పించింది కానీ పూర్తిగా తెలుసుకోలేని పరిస్థితి బాబుగారు. పెద్ద బొట్టమ్మ తినకుండా లేచింది కానీ లేదంటే ఏం జరిగుండేదో. విశాల్: తను విష సర్పం అయినా సరే తనని కూడా బలి తీసుకోవాలి అనుకుంది అంటే మీ చెల్లి ఎలాంటి ఆడదో అర్ధమవుతుంది. నయని మీ చెల్లిని ఇలా అన్నందుకు నన్ను క్షమించు. నయని: మీ లాంటి మంచి వాళ్లకే తన మీద కోపం వస్తుంది అంటే తన క్యారెక్టర్‌ని ఎంత దిగజార్చుకుందో అర్థమవుతుంది. ఉలూచి పాప కోసం వచ్చిన పెద్దబొట్టమ్మ సుమన దుర్మార్గాన్ని గుర్తించలేదు ఏమో. విశాల్: ఏది ఏమైనా సరే నయని .. సుమనతో నువ్వు జాగ్రత్త.. రక్త సంబంధాన్ని అడ్డుపెట్టుకొని ఎంతకైనా తెగించొచ్చు

ఇక ఉదయం కడుపునొప్పితో సుమన చాలా ఇబ్బంది పడుతుంది. విక్రాంత్ వచ్చి సెటైర్లు వేస్తాడు. ఇక పావనామూర్తి, డమ్మక్క అక్కడికి వస్తారు. డమ్మక్క విశాలాక్షి అమ్మవారి దగ్గర ఉంచిన విభూది కలిపిన పాళ్లను సుమనకు ఇస్తుంది. సుమన వాటిని తాగుతుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read : ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : అనామిక జాతకం బాగాలేదన్న పంతులు - అప్పును ఇంట్లోకి తీసుకెళ్లిన కళ్యాణ్