Naga Panchami Serial Today Episode


నాగదేవత: (సుబ్బుతో) మీరు మీ భక్తురాలిని కరుణించడంలో మాకు ఎలాంటి ఆక్షేపణ లేదు స్వామి. కానీ మీరు మా యువరాణి విషయంలో మీరు చూపించే కరుణ కటాక్షాలు మా నాగలోకానికి ప్రాణ సంకటంగా మారాయి స్వామి. మా నాగలోక పద్ధతులు, ఆచారాలు మా నాగలోక నియమావళి తమకు తెలియనిది కాదు. శత్రువుని క్షమించడం.. ప్రాణ భిక్ష పెట్టడం.. చంపకుండా వదిలేయడం.. మా నాగజాతికి నచ్చని లక్షణాలు.. పగ ప్రతీకారం మా జాతికి ఆయువు పట్టు. అవి కోల్పోవడం అంటే నాగ జాతికి అంతకు మించి అవమానం మరొకటి ఉండదు స్వామి
సుబ్బు (సుబ్రహ్మణ్యస్వామి): మీ మనోవేదన మాకు అర్థమైంది నాగదేవత. నా భక్తులకు నేను ప్రసాదించే ఆశీస్సులు మరొకరికి బాధించేలా ఉండవు. మీరు నా విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 
నాగదేవత: రేపు కార్తీక పౌర్ణమి రోజున మేము మా యువరాణిని నాగలోకాని తీసుకెళ్లాలి స్వామి. 
సుబ్బు: అందుకే కదా నాగదేవత మీ యువరాజు ఫణేంద్ర ఇక్కడే కాచుకున్నాడు. తన కార్యసాధనకు నేను అడ్డురానని చెప్పాను. 
నాగదేవత: మా యువరాణి విషయంలో మాకు ఎలాంటి ఆటంకం కలిగించాను అని నాకు కూడా మాటిచ్చారు స్వామి
సుబ్బు: నేను ఇచ్చిన మాట ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది. పంచమి నా భక్తురాలు తను పాముగా మారితేనే మీ యువరాణి. నా భక్తురాలు పంచమిని పంచమిగా మీరు నాగలోకం తీసుకెళ్లలేరు. ఇది నా ఆజ్ఞ కాదు నాగదేవత. అలాంటి అవకాశం మీకు లేదు
నాగదేవత: అవును స్వామి.. పంచమి పాముగా మారిన తర్వాతే మేము తీసుకెళ్లగలం. కాని అక్కడే పెద్ద తిరకాసు ఉంది స్వామి. పాముగా మారి మోక్షను కాటేసిన తర్వాతే మేము యువరాణిని తీసుకెళ్లాలి. కానీ మీరు మోక్షకు రక్షణ కల్పిస్తే మా కార్యం నెరవేరదు స్వామి. 
సుబ్బు: నా ఆశీస్సులు పంచమికి మాత్రమే ఉంటాయి నాగదేవత. పంచమి పసుపు కుంకుమలతో ముత్తయిదువుగా ఉండాలి అంటే తన భర్త ప్రాణాలతో ఉండాలి కదా.. 
నాగదేవత: అప్పుడు మేము మోక్ష ప్రాణాలు ఎలా తీయగలం స్వామి
సుబ్బు: పంచమి పాముగా మారిన సమయంలో నా ఆశీస్సులు ఏవీ ఆ పాముకు ఉండవు.   
నాగదేవత: సరే స్వామి.. ఇప్పుడు మహా మృత్యుంజయ హోమం తలపెట్టారు. అప్పుడు పంచమి పాముగా మారినా కూడా కాటేయడం కూడా కష్టమేకదా స్వామి. 
సుబ్బు: ఆ యాగం నేను తలపెట్టలేదు నాగదేవత. ఆ యాగం చేస్తే మంచిదని సలహా కూడా నేను ఇవ్వలేదు. 
నాగదేవత: కానీ  తమరి సమక్షంలోనే కదా స్వామి ఆ యాగం జరుగుతుంది. 
సుబ్బు: మీ భయం అర్థమైంది నాగదేవత. నేను ఆ యాగంలో పాల్గొనను. నా చేతుల మీద ఆ యాగం జరిపించను. 
నాగదేవత: ఈ మాట చాలు స్వామి. మీ హస్తం లేకపోతే చాలు. మేము ఆ యాగం చేయకుండా ఆపగలం. అప్పుడు మోక్ష ప్రాణాలు కాపాడటం ఎవరి వల్ల కాదు. 
సుబ్బు: మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి నాగదేవత. తన భర్త ప్రాణాలు కాపాడుకోవడాని పంచమి తాపత్రయం తనది. నేను నిమిత్తమాత్రుడ్ని మాత్రమే. 


మరోవైపు మోక్ష కారు దగ్గరు ఉంటే అక్కడికి మోహిని వస్తుంది. మోహినితో మోక్ష నీపై నా భార్య పంచమికి మంచి అభిప్రాయం లేదు అని అంటాడు. దీంతో మోహిని నేను నంబూద్రీ చెల్లిని అని చెప్పిందా అని అడుగుతుంది. ఇక మోక్ష మరి మా అమ్మ ఎందుకు నిన్ను తన ఫ్రెండ్ కూతురు అని చెప్పింది అని అడుగుతాడు. దానికి మోహిని నీకు నంబూద్రీపై మంచి అభిప్రాయం లేదు అని అందుకే అలా చెప్పాల్సి వచ్చిందని అంటుంది. దీంతో మోక్ష ఇప్పుడు తనకు నంబూద్రీపై మంచి అభిప్రాయం, భక్తి ఉన్నాయని చెప్తాడు. ఇక ఇద్దరు పంచమి గురించి మాట్లాడుకుంటారు. ఇక పంచమి కాటు నుంచి మోక్షను కాపాడే అవకాశం తనకి ఉందని మోహిని నమ్మిస్తుంది. పంచమి పాము విషంతో తాను విరుగుడు కనిపెడతానని నమ్మిస్తుంది. ఇక పంచమి పాముగా మోక్షను కాటేసిన తర్వాత పంచమిని బంధించి నాగలోకం వెళ్లకుండా ఆపుతాను అని చెప్తుంది. మోహిని మాటలు నమ్మేసిన మోక్ష వాళ్లతో పాటు ఊరికి మోహినిని రమ్మని చెప్తాడు. 


మరోవైపు తనని శాశ్వతంగా భూలోకంలో ఉంచడానికి మోక్ష ప్రయత్నాల్ని తలచుకొని పంచమి ఏడుస్తుంది. అప్పుడే అక్కడికి ఫణేంద్ర వస్తాడు. 
ఫణేంద్ర: యువరాణి నీ గురించి నాగదేవత చెప్తే నాకు అతిశయోక్తి అని పించింది. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే నువ్వు ఇంకా మొండి గటంలా ఉన్నావ్. ఈ ముళ్లోకాలు ఏకమైనా ప్రాణ గండం నుంచి మోక్షను  రక్షించడం సాధ్యం కాదని నీకు నాకు అందరికీ తెలుసు. నువ్వు నాగలోకానికి సంబంధించిన దానివి కాబట్టే మోక్ష చావు వాయిదా పడుతుంది. మోక్షని చంపాలని నీ తల్లి చివరి కోరిక. మహారాణి కోరిక నెరవేర్చడం కోసం మేమంతా ఎదురు చూస్తున్నాం
పంచమి: అది మీ నాగలోక నియమావళి అయిండొచ్చు. కానీ ఇక్కడ భార్యకు భర్తే ప్రాణం. భర్త ప్రాణాలు కాపడటానికి ఎంతకైనా తెగిస్తుంది. నేను అంతే. నాగలోకం అంతా వచ్చి చెప్పినా నా భర్తకు నేను కీడు తలపెట్టను. 
ఫణేంద్ర: నువ్వు ఎన్ని యాగాలు, పూజలు చేసినా.. పౌర్ణమి రోజున నువ్వు పాముగా మారాల్సిందే. అప్పుడు మోక్షను కాటేయాల్సిందే. నువ్వు అలా చేయకపోతే మరో నాగు మోక్షను కాటేస్తుంది. నువ్వు మన జాతి మీదే యుద్ధం ప్రకటిస్తున్నావ్. కన్నతల్లి చివరి కోరిక తీర్చలేకపోతున్నావ్
పంచమి: చిన్న వయసులో చేసిన తప్పును క్షమించలేని జాతి నాకు అవసరం లేదు. 
ఫణేంద్ర: ఈ యాగం ఆపేయ్ యువరాణి.. ఈ యాగం ఆపకుంటే మోక్ష ప్రాణాలు పోవడం ఖాయం. నీ కళ్ల ముందే మోక్ష మరణిస్తాడు. 
పంచమి: తనలో తాను.. అలా జరగకముందే నేను కన్ను మూయాలి. మరో మార్గంలేదు. 


మరోవైపు పంచమి కోసం మోక్ష తన గదిలో వెతుకుతాడు. పంచమి బయట కూర్చొని ఏడుస్తుంది. ఈ తాను పాముగా మారి మోక్షని కాటేయముందే తాను చనిపోతాను అని పంచమి మనసులో అనుకుంటుంది. తాను చనిపోవడమే శాశ్వత పరిష్కారం తన మనసులో ఉందని పంచమి చెప్తుంది. తన గండం వల్ల ఇద్దరు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే నువ్వు తల్లి అవ్వాలని పంచమితో మోక్ష చెప్తాడు. ఆ విషయం గురించి ఆలోచించమని చెప్తాడు. ఈ ఇంట్లో ఇదే తనకు చివరి రోజు అని మోక్ష అంటాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.