Telugu Bigg Boss 7: బిగ్ బాస్ రియాలిటీ షోలో బిగ్ బాస్ ఎప్పుడు సీరియస్‌గా ఉంటాడో.. ఎప్పుడు కంటెస్టెంట్స్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయిస్తారో చెప్పలేం. ఇక బిగ్ బాస్ సీజన్ 7 అంతా ఉల్టా పుల్టా కాబట్టి దాని గురించి గెస్ చేయడం మరింత కష్టంగా మారింది. ఇక తాజాగా ప్రసారమయిన నామినేషన్స్ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ అంతా తెగ గొడవపడ్డారు. ముఖ్యంగా అమర్‌దీప్, ప్రశాంత్ మధ్య జరిగిన గొడవే ఎపిసోడ్‌కు హైలెట్‌గా నిలిచింది. ఇక నామినేషన్స్ వాడివేడిగా ముగిసిన తర్వాత కంటెస్టెంట్స్‌ను చిల్ చేయాలని బిగ్ బాస్ ఫిక్స్ అయ్యారు. అందుకోసం అమర్‌దీప్‌నే సెలక్ట్ చేసుకున్నారు. దానికి సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది.


అమర్‌తో బిగ్ బాస్ ఆటలు..
‘‘మీ అందరూ చిల్ అవ్వడానికి ఒక పార్టీ అవసరమని బిగ్ బాస్ భావిస్తున్నారు’’ అంటూ బిగ్ బాస్ ప్రకటించి.. అమర్‌దీప్‌ను యాక్టివిటీ ఏరియాలోకి పిలిపించారు. లోపలికి వచ్చిన తర్వాత ‘‘పార్టీలో ఏమేం ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు’’ అంటూ అమర్‌ను అడిగాడు బిగ్ బాస్. ‘‘ఎప్పుడూ మాకు ఇచ్చే పార్టీ టైప్‌లాగా చిప్స్, కూల్ డ్రింక్స్.. ఇలా ఏమైనా ఉండొచ్చేమో అనుకుంటున్నాను’’ అని అమర్ సమాధానమిచ్చాడు. ‘‘మీరు చేసుకునే పార్టీలో కేవలం ఇవే ఉంటాయా?’’ అని కౌంటర్ ఇచ్చారు బిగ్ బాస్. దానికి అమర్ నవ్వాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న క్లాత్‌ను ఓపెన్ చేయమని బిగ్ బాస్ చెప్పగా.. తీసి చూస్తే అందులో కేక్ ఉంది.


కేక్‌ను తెలుగులో ఏమంటారు..?
‘‘ఆ కేక్ మొత్తం మీరు ఒక్కరే తినాల్సి ఉంటుంది’’ అని బిగ్ బాస్ చెప్పగానే.. ఏంటి అంటూ అమర్ షాక్ అయ్యాడు. ‘‘15 నిమిషాల్లో కేక్ మొత్తం తింటే.. మీ తోటి ఇంటి సభ్యులు కూడా కేక్ తినే అవకాశం లభిస్తుంది’’ అని ట్విస్ట్ పెట్టారు. దీంతో అమర్ కష్టపడి ఆ కేక్ మొత్తాన్ని తినే ప్రయత్నం మొదలుపెట్టాడు. మధ్యమధ్యలో కేక్‌ను తెలుగులో ఏమంటారు అంటూ తనతో జోకులు వేశారు బిగ్ బాస్. అమర్‌కు ఇచ్చిన కేక్ టాస్క్ ముగిసిన తర్వాత కంటెస్టెంట్స్ అంతా పూల్ టాస్క్ ఇచ్చారు. ‘‘పూల్‌లో దూకి డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఏ ఒక్కరైతే మిగతావారికంటే ఆలస్యంగా పూల్‌లోకి దూకుతారో వారు ఈ పార్టీ నుంచి తప్పుకుంటారు’’ అంటూ టాస్క్ గురించి వివరించారు.


పూల్‌లో డ్యాన్సులు..
బజర్ మోగి టాస్క్ మొదలవ్వగానే ఫస్ట్ రౌండ్‌లో అమర్ ఔట్ అయ్యాడు. దీంతో తరువాతి రౌండ్స్‌కు తను సంచాలకుడిగా వ్యవహరించాడు. ఆ తర్వాత శోభా, అర్జున్, ప్రశాంత్, ప్రియాంక వరుసగా ఔట్ అవుతూ గేమ్ నుంచి తప్పుకున్నారు. దీంతో శివాజీ, యావర్ మాత్రం చివరి రౌండ్‌లో మిగిలారు. బిగ్ బాస్ సమయానుసారం పాటలు ప్లే చేస్తూ ఉండగా.. కంటెస్టెంట్స్ అంతా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. అయితే బిగ్ బాస్ ఇచ్చే టాస్కుల్లో ట్విస్ట్ లేకుండా ఉండదు అని, సరదా కోసం మాత్రమే ఈ టాస్క్ పెట్టి ఉండరేమో అని ప్రేక్షకులు అనుమానిస్తున్నారు. మరోవైపు.. సీజన్ 7లో ఫైనల్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇకపై బిగ్ బాస్.. కంటెస్టెంట్స్‌కు సీరియస్ టాస్కులు కాకుండా ఇలాంటి సరదా టాస్కులే ఇస్తుంటారేమో అని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



Also Read: చేతికి గాజులు వేసుకొని కూర్చున్నాను - బిగ్ బాస్ హౌస్‌లో ‘ఆడోడు’ లొల్లి!