Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7లో చివరి నామినేషన్స్ ముగిశాయి. మునుపటి నామినేషన్స్ కంటే ఇందులో గొడవల డోస్ పెంచారు కంటెస్టెంట్స్. విచక్షణ కోల్పోయి అనవరసరమైన మాటలు మాట్లాడారు. ఈ నామినేషన్స్‌లో ముఖ్యంగా అమర్‌దీప్, పల్లవి ప్రశాంత్‌ల మధ్య జరిగిన గొడవ హైలెట్‌గా మారింది. అసలు గొడవ ఎందుకు ప్రారంభమయ్యిందో చాలావరకు ప్రేక్షకులకు అర్థం కాలేదు. కానీ ఒకరిపైకి ఒకరు వచ్చి మరీ అరుచుకున్నారు, తిట్టుకున్నారు. ఇక నామినేషన్స్ ముగిసిపోయిన తర్వాత కూడా అదే మూడ్‌లో ఉండి.. వారు అన్న మాటలను గుర్తుచేసుకున్నాడు అమర్. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.


మా సైడ్ వచ్చి ఆ మాట మాట్లాడు..
నామినేషన్స్‌లో గొడవ జరుగుతున్న సమయంలో ప్రశాంత్.. ఒక సందర్భంలో అమర్‌ను ‘ఆడోడు’ అన్నాడు. అదే మాటను వందసార్లు రిపీట్ చేస్తూ ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించడం మొదలుపెట్టాడు అమర్. నామినేషన్స్ అయిపోయిన తర్వాత కూడా ఆ పదాన్ని పక్కన పెట్టలేదు. ‘‘నిజంగా అంత బుర్ర ఉండి, అంత టాలెంట్ ఉండి, అంత స్ట్రాటజీలు ఉండుంటే ఈరోజు నేను ఇక్కడ ఉండను. ఇలా ఉండను. చేతికి గాజులు వేసుకొని తిరుగుతున్నాను కదా నేను కూడా ఇక్కడ’’ అని అమర్ అంటుండగానే ప్రశాంత్ అక్కడికి వచ్చాడు. ‘‘నేను కూడా చేతికి గాజులు వేసుకొని కూర్చున్నాను కదా. నువ్వు అన్నది అక్కడికే వచ్చింది’’ అని రివర్స్ అయ్యాడు. ‘‘నిన్ను అన్నానా ఆడోడు అని అసలు’’ అని అమర్ ప్రశ్నించాడు. ‘‘ఆయనే చెప్పాడు నువ్వు మొగోడులాగా మాట్లాడుతున్నావంటే మొగోడివని అర్థం. నువ్వు మొగోడివి’’ అంటూ అమర్ పదేపదే ఒకే విషయం మాట్లాడుతున్నా ప్రశాంత్ అది పట్టించుకోకుండా తన ఫ్లోలో తాను ఉన్నాడు. ‘‘నువ్వు ఒకసారి వచ్చి మా సైడ్ ఆ మాట మాట్లాడు’’ అని వార్నింగ్ ఇచ్చాడు. ‘‘మొగోడిలాగా మాట్లాడావు అన్నా అది కూడా బూతు మాట?’’ అని ఆశ్చర్యపోయాడు అమర్. ‘‘అలా అన్నాడా’’ అని ప్రియాంకను అడిగాడు ప్రశాంత్. ‘‘అలాగే అన్నాను. ఇంటికి పోయి వీడియో చూసుకకో’’ అని క్లారిటీ ఇచ్చాడు అమర్.


వాడి పద్ధతిలో వాడు ఉన్నాడు..
‘‘దాన్ని ఆ పాయింట్‌లోనే వదిలేయాలి లేకపోతే మీరు ముందుకు వెళ్లలేరు’’ అంటూ ప్రశాంత్, యావర్‌లకు సలహా ఇచ్చాడు శివాజీ. ‘‘ఇంక వేస్ట్. వాడు ఒక పద్ధతిలో ఉన్నాడు. వాడిని మనం మార్చాలనుకోవడం తప్పు’’ అని అమర్ గురించి అన్నాడు. నామినేషన్స్ సమయంలో ప్రశాంత్ టాపిక్ డైవర్ట్ చేశాడని శోభాకు వచ్చి చెప్పాడు అమర్‌దీప్. ‘‘మనం ఏ పాయింట్ మీద ఉంటామో వాడు దాని మీద ఉండడు. వేరే డైవర్ట్ చేస్తాడు’’ అంటూ శోభా కూడా అమర్ చెప్పిందే కరెక్ట్ అన్నట్టు మాట్లాడింది. ఇక చివరి కెప్టెన్సీ సమయంలో అసలు పల్లవి ప్రశాంత్ ఏం చేశాడు అనే విషయాన్ని ఇన్నాళ్లకు అర్జున్ బయటపెట్టాడు. ‘‘ఆ రోజు నువ్వు రెండో రౌండ్ ఎందుకు వెళ్లవు? అని వాడిని అడిగితే.. నా ఫోటోనే పోయింది ఇంక నేనేందుకు వెళ్తాను’’ అని ప్రశాంత్ అన్నాడని అమర్‌తో చెప్పాడు అర్జున్. ఆ తర్వాత శోభా, అమర్ వెళ్లి మళ్లీ స్పై బ్యాచ్ గురించి డిస్కషన్ పెట్టారు. ‘‘శివాజీని ఫస్ట్ నుంచి ఆయన గేమ్‌లోనే ఉన్నాడు. ఆయన గేమ్‌ను వీళ్లిద్దరూ ఫాలో అవుతున్నారు. ఎలా మాట్లాడాలి, ఎలా చెప్పాలి’’ అని అమర్.. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.



Also Read: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!