Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఆఖరి నామినేషన్స్.. ఎవరూ ఊహించనంత వాడివేడిగా జరిగాయి. ఇప్పటివరకు కంటెస్టెంట్స్ అంతా చాలా నామినేషన్స్‌లో గొడవపడినా.. ఇది ఆఖరిది కాబట్టి వాటన్నింటికంటే తాజాగా జరిగిన నామినేషన్సే హైలెట్ అని ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే ఈ నామినేషన్‌లో హైలెట్‌గా నిలిచింది మాత్రం అమర్‌దీప్, ప్రియాంక. మిగతా హౌజ్‌మేట్స్ నామినేషన్స్ సమయంలో కూడా గొడవలు జరిగినా.. ఎపిసోడ్ మొత్తానికి వీరి నామినేషన్ మాత్రమే హైలెట్‌గా నిలిచింది. ముందుగా పల్లవి ప్రశాంత్.. తనను నామినేట్ చేయగా.. అది నచ్చని అమర్‌దీప్.. తనను రివర్స్ నామినేట్ చేశాడు. అక్కడ గొడవ మొదలయ్యింది.


ముందుగా గతవారం మర్డర్ టాస్కులో ప్రశాంత్.. త్వరగా ఓడిపోవడం నచ్చలేదని కారణంతో తనను నామినేట్ చేశాడు అమర్‌దీప్. అదే విషయాన్ని గుర్తుచేస్తూ ఆ కారణం తనకు నచ్చలేదు అన్నాడు ప్రశాంత్. అది సిల్లీ కారణమని అమర్.. కొట్టేపారేశాడు. ఆ తర్వాత వచ్చిన అమర్.. ప్రశాంత్‌ను నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు. సిల్లీ కారణాల వల్ల నామినేషన్ వేయడం ఆపడం లేదని కారణంగా చెప్పాడు. చిలికి చిలికి గాలి వాన అయినట్టు వారిద్దరి మధ్య మాట, మాట పెరిగి పెద్ద గొడవకే దారితీసింది. చివరి కెప్టెన్సీ సమయంలో అమర్‌కు సపోర్ట్ చేసిన విషయం గుర్తుచేసుకొని బాధపడ్డాడు ప్రశాంత్. అలా చేయకుండానే ఉండాల్సింది అని అరవడం మొదలుపెట్టాడు. నమ్మాను కాబట్టే మోసపోయాను అని, అమర్ చేసింది నమ్మకద్రోహం అని ఆరోపణలు చేశాడు.


ఆడోడి మాటలు మాట్లాడకు..
ప్రశాంత్ మాటలు విన్న అమర్.. కాసేపటికి సహనం కోల్పోయాడు. కావాలనే ఇదంతా మాట్లాడుతున్నావని, శోభా చెప్పినట్టు ప్రశాంత్.. కెప్టెన్సీ సమయంలో చివరి రౌండ్‌లో ముందుకు వచ్చుంటే తాను కెప్టెన్ అయ్యేవాడని అరవడం మొదలుపెట్టాడు. అది పట్టించుకోని ప్రశాంత్.. అమర్‌కు సపోర్ట్ చేసి తప్పు చేశానని పదేపదే అన్నాడు. కింద పడి ఏడుస్తుంటే చూడలేక సపోర్ట్ చేశానని బయటపెట్టాడు. అంతే కాకుండా గొడవ మధ్యలో ఆడోడి మాటలు మాట్లాడకు అనే పదాన్ని కూడా ఉపయోగించాడు. దీంతో గొడవ మరింత పెద్దగా అయ్యింది. ప్రశాంత్ అన్న ఆ మాటకు.. నువ్వు మగోడి మాటలు మాట్లాడుతున్నావా అంటూ అమర్ రివర్స్ అయ్యాడు.


గాజులు తీసుకురండి..
గొడవలో ప్రశాంత్ అన్న పదాన్ని మరో విధంగా అర్థం చేసుకున్న అమర్.. నేను ఆడోడిని అంట అని పదేపదే రిపీట్ చేశాడు. అంతే కాకుండా గాజులు తీసుకురండి వేసుకుంటా అని విచక్షణ లేకుండా మాటలు వదిలేశాడు. నేను అలా అనలేదు అని ప్రశాంత్ చెప్తున్నా వినకుండా తన ఫ్లోలో తను మాట్లాడుకుంటూ ఉండిపోయాడు. నామినేషన్ అయిపోయింది వెళ్లి కూర్చో అంటున్నా కూడా ప్రశాంత్ కూర్చోకుండా తేల్చుకుంటాను అని గొడవను మరింత పెద్దగా చేస్తూనే ఉన్నాడు. చివరికి శివాజీ జోక్యంతో ప్రశాంత్ కూర్చున్నా కూడా మధ్యమధ్యలో అమర్.. చేస్తున్న ఇతర నామినేషన్‌కు మధ్యలో జోక్యం చేసుకుంటూనే ఉన్నాడు. తనను ‘రా’ అనొద్దని హెచ్చరించాడు. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే.. ప్రేమిస్తే ఎప్పటికీ ప్రేమిస్తా.. నువ్వు ఎప్పటికీ నా తమ్ముడివే అంటూ చివరిలో ఒక ఎమోషనల్ డైలాగ్ కొట్టాడు అమర్‌దీప్.


Also Read: నయనతార చిత్రానికి చిక్కులు - బ్యాన్ చేయాలంటూ డిమాండ్