Telugu Bigg Boss 7: మామూలుగా బిగ్ బాస్ రియాలిటీ షోలో గ్రూప్ గేమ్ జరగడం లేదు అని ఎవరైనా చెప్పినా.. అది అబద్ధమే అవుతుంది. ఎందుకంటే ఈ రియాలిటీ షోలోకి బయటి నుండే ఫ్రెండ్స్‌గా ఉన్న వ్యక్తులు మాత్రమే కాకుండా.. అక్కడే వచ్చి కనెక్ట్ అయినవారు కూడా ఉంటారు. అలా ఎవరికి నచ్చిన కంటెస్టెంట్‌కు వారు సాయంగా ఉండాలని, సపోర్ట్ చేయాలని అనుకుంటారు. అలాగే ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7లో ‘స్పా’, ‘స్పై’ అని రెండు గ్రూపులు ఉన్నాయి. అయితే ‘స్పా’ గ్రూప్‌లో ఉన్నందుకు గత కొంతకాలంగా ప్రియాంకపై నెగిటివిటీ ఎక్కువయిపోతుంది. అదంతా పోగొట్టుకోవడానికి తాజాగా జరిగిన నామినేషన్స్‌లో అమర్‌దీప్‌ను నామినేట్ చేయాలని నిర్ణయించుకుంది.
నెగిటివిటీని పోగొట్టే ప్రయత్నం..
గతవారం జరిగిన ఫినాలే అస్త్రా రేసులో ఎవరూ ఊహించని విధంగా అర్జున్ విన్నర్ అయ్యాడు. కానీ కంటెస్టెంట్స్ దగ్గర నుండి ఎక్కువ సపోర్ట్ మాత్రం అమర్‌దీప్‌కే లభించింది. ముందుగా శోభా, శివాజీ కలిసి తన పాయింట్స్ మొత్తాన్ని అమర్‌దీప్‌కు ఇవ్వగా.. ప్రియాంక మాత్రం తనను కెప్టెన్ చేశాడనే కృతజ్ఞతతో గౌతమ్‌కు పాయింట్లు ఇచ్చేసింది. అది నచ్చని అమర్.. తనను ఏదో ఒకటి అంటూనే ఉన్నాడు. ఆ మాటలు భరించలేని ప్రియాంక.. గౌతమ్‌తో చెప్పి తన పాయింట్లను తిరిగి అమర్‌కు ఇప్పించింది. ప్రియాంక చేసిన ఈ పని వల్ల తనకు చాలా నెగిటివిటీ ఏర్పడింది. గ్రూప్ గేమ్ ఆడుతుందని, సోలోగా ఆడడం రావడం లేదని ప్రేక్షకులు సైతం విమర్శిస్తున్నారు. దీంతో ఈ విమర్శలకు చెక్ పెట్టాలని ప్రియాంక నిర్ణయించుకుంది.
పదేపదే అనడం నచ్చలేదు..
టాస్క్‌లో అమర్ ఫౌల్ చేశాడని ముందుగా కారణం చెప్పి తనను నామినేట్ చేసింది ప్రియాంక. ఆ తర్వాత ఫినాలే అస్త్రా సమయంలో తనను పదేపదే అలా అనడం నచ్చలేదని బయటపెట్టింది. అయితే అదే సమయంలో యావర్.. ఎవరినీ అడగకుండా ఫ్రెండ్‌గా ప్రశాంత్‌కు సపోర్ట్ చేస్తూ.. తన పాయింట్స్‌ను ప్రశాంత్‌కు ఇచ్చేశాడని, అదే సపోర్ట్‌ను ప్రియాంక నుండి కోరుకున్నానని అమర్ అన్నాడు. సపోర్ట్ కోరుకోవడం తప్పు కాదని, ఒకవైపు తను ఓడిపోయిన బాధలో ఉంటే పదేపదే పాయింట్ల గురించి అనడం తనకు నచ్చలేదని ప్రియాంక చెప్పింది. పదేపదే ఏమీ అనలేదని అమర్ రివర్స్ అయ్యాడు. అయినా నామినేషన్ చేసిన తర్వాత మాట్లాడేది ఏమీ లేదని సైలెంట్ అయిపోయాడు.
వారే విన్నర్..
ఇక బిగ్ బాస్ సీజన్ 7లోని చివరి నామినేషన్స్‌లో అర్జున్ తప్పా మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ ఉన్నారు. అర్జున్.. ఫినాలే అస్త్రా గెలవడంతో తను నేరుగా ఫైనల్ వీక్‌కు వెళ్లిపోయాడు. ఈవారం ఎలిమినేషన్ నుండి కూడా విముక్తిపొందాడు. అయితే బిగ్ బాస్ చరిత్రలో ముందెన్నడూ లేనివిధంగా రెండువారాల పాటు విన్నర్ కోసం ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయని బిగ్ బాస్ తెలిపారు. అంటే ఈవారం జరిగే ఓటింగ్స్ కూడా విన్నర్ ఎవరో డిసైడ్ చేయగలవు అని అర్థం. ఈవారం ఓటింగ్ విషయంలో ఎవరు లాస్ట్‌లో ఉంటారో.. వారు ఎలిమినేట్ అవుతారు. కానీ ఇప్పటినుండి కంటెస్టెంట్స్‌కు వచ్చే ఓట్లు వారిలో ఫైనల్ విన్నర్ ఎవరో డిసైడ్ చేస్తాయి అని బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చారు
Also Read: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!