Telugu Bigg Boss 7: బిగ్ బాస్ రియాలిటీ షోలో కొన్ని ఎలిమినేషన్స్ చాలా అన్‌ఫెయిర్ అనిపిస్తాయి. అసలు ఈ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వకుండా ఉండాల్సింది అని ప్రేక్షకులు అనుకున్న సందర్భాలు చాలానే ఉంటాయి. తాజాగా బిగ్ బాస్ సీజన్ 7లో గౌతమ్ ఎలిమినేట్ అయిపోయినప్పుడు కూడా చాలామంది అదే అనుకున్నారు. ఆఖరికి డేంజర్ జోన్‌లో శోభా శెట్టి, గౌతమ్.. డేంజర్ జోన్‌లో ఉన్నప్పుడు శోభానే ఎలిమినేట్ అవుతుందని ఆడియన్స్ పోల్‌లో తేలింది. కానీ దానికి రివర్స్‌లో గౌతమ్ ఎలిమినేట్ అవ్వడంతో చాలామంది ఆశ్చర్యపోయారు.
గౌతమ్ 2.0..
ఒకసారి ఎలిమినేట్ అయిపోయి ఒకరోజు సీక్రెట్ రూమ్‌లో ఉండి బయటికి వచ్చాడు గౌతమ్. అయితే ఆ ఎలిమినేషన్ సమయంలో కంటెస్టెంట్స్ అంతా తనతో ఎలా ప్రవర్తించారో గౌతమ్ మనసులో బలంగా ఉండిపోయింది. అందుకే తను వెళ్లిపోలేదని, 2.0 వర్షన్‌గా మళ్లీ వచ్చానని చెప్తూ హౌజ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటినుండి గౌతమ్ ఆటతీరే మారిపోయింది. బిగ్ బాస్ హౌజ్‌లో రెండు గ్రూపులు ఉన్నా.. తను మాత్రం ఏ గ్రూప్‌తో సంబంధం లేకుండా సోలోగా ఆడడానికే ట్రై చేశాడు. ఎంటర్‌టైన్మెంట్ విషయంలో కూడా బిగ్ బాస్ ప్రేక్షకులను అప్పుడప్పుడు నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక సీజన్ మొదట్లో శుభశ్రీతో లవ్ ట్రాక్ వర్కవుట్ అవుతుంది అనుకున్నా కూడా కుదరలేదు. ఇక తాజాగా ఎలిమినేట్ అయిపోయిన ఈ డాక్టర్ బాబు రెమ్యునరేషన్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
సరిపడా రెమ్యునరేషన్..
రోజుకు రూ.25,000 రెమ్యునరేషన్ అనే అగ్రిమెంట్‌తో గౌతమ్.. బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టాడట. అంటే వారానికి తన రెమ్యునరేషన్ రూ.1,75,000. గౌతమ్ పూర్తిగా 13 వారాల పాటు బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నాడు కాబట్టి మొత్తంగా రూ.22,75,000 పారితోషికాన్ని ఇంటికి తీసుకువెళ్లాడు. 13 వారాలు బిగ్ బాస్ షోలో ఉన్నందుకు గౌతమ్‌కు బాగానే లాభం వచ్చిందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఈ షోలో గెలిస్తే ప్రైజ్ మనీగా వచ్చే రూ.50 లక్షలతో తన లోన్స్‌ను క్లియర్ చేస్తానని బయటపెట్టాడు గౌతమ్. అయితే ఇప్పుడు తనకు వచ్చిన రెమ్యునరేషన్ కూడా ఆ లోన్స్ క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.
ఫినాలే అస్త్రా వీక్‌లో డల్..
ముందు నుండి గౌతమ్.. అన్ని విషయాల్లో పర్వాలేదు అనిపించినా.. హౌజ్ నుండి ఎలిమినేట్ అయిపోయే వారం ముందు మాత్రం.. అంటే ఫినాలే అస్త్రా వీక్‌లో మాత్రం చాలా డల్ అయిపోయాడు. కేవలం టాస్కుల వరకు పూర్తిస్థాయిలో గెలవడానికి ప్రయత్నాలు చేసినా.. అంతకు మించి ప్రేక్షకులకు తాను ఏ కంటెంట్ ఇవ్వలేకపోయాడు. ప్రియాంక.. తనకు పాయింట్స్ ఇవ్వడం, ఆ పాయింట్స్ తను అర్జున్‌కు కాకుండా తిరిగి అమర్‌కు ఇవ్వడం ఇదంతా ప్రేక్షకులకు సైతం నచ్చలేదు. ఇక గౌతమ్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత అసలు ఓటింగ్ విషయంలో లాస్ట్‌లో అర్జున్ ఉన్నా కూడా తనకు ఫినాలే అస్త్రా లభించింది కాబట్టి గౌతమ్ ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చిందని నాగార్జున బయటపెట్టాడు. పల్లవి ప్రశాంత్ చేతిలో ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉన్నా కూడా తను ఎవరికోసం ఉపయోగించడానికి ఇష్టపడలేదు.
Also Read: చేతికి గాజులు వేసుకొని కూర్చున్నాను - బిగ్ బాస్ హౌస్‌లో ‘ఆడోడు’ లొల్లి!