Malviya and Samarth Jurel Kiss : బిగ్ బాస్ ఒక రియాలిటీ షో కాబట్టి, కోట్ల మంది ప్రేక్షకులు షోను చూస్తూ ఉంటారు కాబట్టి మాటల విషయంలో, ప్రవర్తన విషయంలో కంటెస్టెంట్స్ కంట్రోల్‌లో ఉండాలని ముందుగానే బిగ్ బాస్ మేకర్స్ అగ్రిమెంట్‌ను రాయించుకుంటారు. కానీ కొన్నిసార్లు కంటెస్టెంట్స్.. ఈ రూల్స్‌ను బ్రేక్ చేస్తుంటారు. ముఖ్యంగా హిందీ బిగ్ బాస్‌లో ప్రేక్షకులు చూడలేని విధంగా కంటెస్టెంట్స్ ఎన్నోసార్లు ప్రవర్తించారు. ఆడియన్స్ చూడడానికి ఇబ్బందిపడే విషయాలు అందులో ఎన్నో జరిగాయి. తాజాగా అలాంటిదే మరొకటి జరిగింది. ప్రస్తుతం దీని గురించి సోషల్ మీడియాలో బిగ్ బాస్ ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.


వైరల్ అవుతున్న ఫోటో..
ప్రస్తుతం హిందీలో బిగ్ బాస్ సీజన్ 17 నడుస్తోంది. ఇప్పటికే ఆ షోలో జరుగుతున్న కాంట్రవర్సీలు, గొడవలు అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అలాంటి వైరల్ అయ్యే అంశం తాజాగా మరొకటి జరిగింది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌లో ఇషా మాల్వియా, సామ్రాఠ్ జురెల్ కూడా ఒకరు. ప్రస్తుతం ఇషా, సామ్రాఠ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అందుకే హౌజ్‌లో వీరిద్దరూ చేసే రొమాన్స్‌కు హద్దులు లేకుండా పోతున్నాయి. వీరి రొమాన్స్ వల్ల చూసే ప్రేక్షకులు పలుమార్లు ఇబ్బంది పడి, అదే విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు కూడా. తాజాగా హౌజ్‌లో లైట్స్ అన్నీ ఆఫ్ అయిన తర్వాత వీరిద్దరూ ముద్దుపెట్టుకోవడం మరోసారి ఆడియన్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.


అప్పుడే గొడవలు.. అంతలోనే ప్రేమ..
బిగ్ బాస్ గురించి అప్డేట్స్‌ను షేర్ చేసే ట్విటర్ పేజ్ ఒకటి.. ఇషా, సామ్రాఠ్‌లు ముద్దుపెట్టుకుంటున్న ఫోటోను షేర్ చేసింది. ఇది చూసి ప్రేక్షకులు నెగిటివ్ కామెంట్స్ మొదలుపెట్టారు. వీరిద్దరు బిగ్ బాస్ రియాలిటీ షోలో కాకుండా టెంప్టేషన్ ఐల్యాండ్ అనే షోలో పాల్గొంటే బాగుంటుందంటూ ఒకరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే బిగ్ బాస్ హౌజ్‌లో ఇషా, సామ్రాఠ్ పలుమార్లు సీరియస్‌గా గొడవపడ్డారు. అలా ఒకసారి గొడవపడిన సమయంలో ‘‘నాకు నీతో ఉండడం ఇష్టం లేదు’’ అంటూ ఇషా అక్కడి నుండి వెళ్లిపోయింది కూడా. కానీ ఎన్ని గొడవలుపడినా వెంటనే కలిసిపోతూ.. తమ రొమాన్స్‌తో ప్రేక్షకులను ఇబ్బందిపెడుతోంది ఈ జంట. 






మా కూతురిని ఇంటికి పంపేయండి..
అయినా ఇషా, సామ్రాఠ్.. ఇలా ఓపెన్‌గా ముద్దుపెట్టుకోవడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా బిగ్ బాస్ హౌజ్‌లో ఇలా పలుమార్లు జరిగింది. ఇదంతా ఇషా తల్లిదండ్రులకు నచ్చక.. తమ కూతురిని ఇంటికి పంపించేయమని కూడా కోరారు. మరి వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ సల్మాన్ ఖాన్ వచ్చిన తర్వాత ఈ ముద్దు గురించి ఏమైనా మాట్లాడతాడేమో చూడాలి అని ఆడియన్స్.. ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 17లో మూడు సెక్షన్స్ ఉన్నాయి. అదే దిల్, దిమాగ్, దమ్. కంటెస్టెంట్స్ అంతా గ్రూప్స్‌గా విడిపోయి ఈ మూడు సెక్షన్స్‌లో ఉంటున్నారు. తాజాగా జరిగిన ఎలిమినేషన్‌లో తెహెల్కా అలియాస్ సన్నీ ఆర్య.. బిగ్ బాస్ హౌజ్‌ను వదిలి వెళ్లిపోయింది. 


Also Read: ‘బిగ్ బాస్’ హౌస్‌లో తడిచి ముద్దయిన కంటెస్టెంట్స్ - పార్టీయా? పనిష్మెంటా?