Rent A Girlfriend:
జపాన్‌లో ఈ సర్వీస్..
ప్రతి ప్రాబ్లమ్‌కీ ఏదో ఓ సొల్యూషన్ ఉంటుంది. కాస్తంత ఓపిగ్గా ఆలోచించాలంతే. జపాన్ ప్రభుత్వం ఇలానే ఆలోచించి ఓ పెద్ద సమస్యకి పరిష్కారం కనిపెట్టేసింది. లాంగ్‌టర్మ్ రిలేషన్‌షిప్‌లో కాకుండా నచ్చినప్పుడు ఓ పార్టనర్ పక్కనే ఉండాలనుకునే సింగిల్స్‌కి పెద్ద సాయం చేస్తోంది అక్కడి ప్రభుత్వం. గంటల లెక్కన పార్ట్‌నర్‌లను అద్దెకు తీసుకునే స్కీమ్ తీసుకొచ్చింది. ఇందుకోసం కొన్ని వెబ్‌సైట్‌లనూ లాంఛ్ చేసింది. కాకపోతే...గవర్నమెంట్ అప్రూవల్ ఉన్న వెబ్‌సైట్‌లలో మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. చాలా మంది పెళ్లిపై నమ్మకం కోల్పోతున్నారు. ఒంటరితనానికి అలవాటు పడుతున్నారు. పెళ్లిళ్లు చేసుకునే వాళ్ల సంఖ్య కూడా తగ్గిపోతుంది. ఇలాగే కొనసాగితే మానసిక సమస్యలు వస్తాయని భావించిన జపాన్ ప్రభుత్వం అప్పుడప్పుడైనా కాస్త జాలీగా గడపాలనే ఉద్దేశంతో ఇలా " Rent A Girlfriend or Boyfriend" స్కీమ్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కానీ ఈ సర్వీస్ అంత చీప్ ఏమీ కాదు. గంటకు రూ.3 వేలు కట్టాల్సిందే. అంతే కాదు. కచ్చితంగా రెండు గంటల పాటు బుక్ చేసుకోవాల్సిందే. ఇక గర్ల్‌ఫ్రెండ్‌ని కానీ బాయ్‌ఫ్రెండ్‌ని కానీ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే అదనంగా రూ.1,200 చెల్లించాలి. ఫస్ట్‌టైమ్ బుక్ చేసుకున్న వారికి మాత్రం ఫ్రీ. ఆ తరవాత నుంచి ఈ రూ.1,200 కచ్చితంగా వసూలు చేస్తారు. ఇప్పటి వరకూ గర్ల్‌ఫ్రెండ్ లేని వాళ్లు, ఎప్పుడూ ఓ అమ్మాయితో బయటకు వెళ్లని వాళ్లు, బిజీలో పడిపోయి అసలు అమ్మాయిలను పట్టించుకోని వాళ్లు...ఈ సర్వీస్‌ని తెగ వాడేస్తున్నారు.
రూల్స్ ఫాలో అవ్వాల్సిందే..
అయితే...అమ్మాయిలను లేదా అబ్బాయిలను అద్దెకి తీసుకోవాలనుకుంటో కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. రెంటల్ గర్ల్‌ఫ్రెండ్‌తో డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవడానికి కంపెనీ ఒప్పుకోదు. ఇక గర్ల్‌ఫ్రెండ్స్‌ని ఇంప్రెస్ చేయాలని టిప్స్, కాస్ట్‌లీ గిఫ్ట్‌లు ఇవ్వాలని చూస్తే అసలు ఒప్పుకోరు. ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది కంపెనీ. ఇక బాయ్‌ఫ్రెండ్ కావాలనుకునే అమ్మాయిలూ ఇలా రూల్స్ పాటించాల్సిందే. మరో హైలైట్ ఏంటంటే...కేవలం గర్ల్‌ఫ్రెండ్స్, బాయ్‌ఫ్రెండ్స్‌నే కాదు ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా అద్దెకు తీసుకునే సర్వీస్‌లు అందుబాటులోకి వచ్చాయి.
అద్దెకి నాన్నలు..
చైనాలోని ఓ బాత్‌హౌజ్ (Bathhouse) "నాన్నలను రెంట్‌కి ఇస్తోంది". అవాక్కయ్యారా..? ఇందులో ఎలాంటి మతలబు లేదు. మీరు విన్నది నిజమే. పిల్లలు అయ్యాక మహిళలకు సెల్ఫ్‌కేరింగ్‌కి చాలా తక్కువ టైమ్ ఉంటుంది. వాళ్లకు సమయం కేటాయించడంలోనే సరిపోతుంది. ఒక్కసారైనా పిల్లలను ఎవరికైనా అప్పగించి కాసేపు అలా సేద తీరాలని అనిపిస్తుంది. అదిగో అలాంటి తల్లుల కోసమే ఈ "Dads on Rent" సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. మరి ఎవరికి పడితే వాళ్లను అప్పగించి అలా వెళ్లిపోలేరు కదా. అందుకే...ఆ చిన్నారులను కాసేపు అలా ఆడించేందుకు ఓ వ్యక్తిని అద్దెకి తీసుకుంటారు. కాసేపు ఆ చిన్నారికి ఆ వ్యక్తే నాన్న అయిపోతాడు. షెన్యాంగ్‌లోని ఓ బాత్‌హౌజ్ ఈ సర్వీస్ ఇస్తోంది. చైనాలోని బాత్‌హౌజ్‌లలో మహిళలు, పురుషులకు వేరువేరు సెంటర్స్ ఉంటాయి. ప్రైవసీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అయితే...అక్కడికి ఆ చిన్నారులను తీసుకెళ్లడం చాలా మంది తల్లులకు ఇబ్బందిగా అనిపించింది. ముఖ్యంగా అబ్బాయిలు వస్తే కంఫర్ట్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారట. ఇది గమనించి ఓ బాత్‌హౌజ్ ఇలా "రెంట్ ఏ డాడ్" సర్వీస్‌ని తీసుకొచ్చింది. హైలైట్ ఏంటంటే...ఈ సర్వీస్‌ని ఫ్రీగానే వాడుకోవచ్చు.