US Flights Cancelled:
2,600 విమానాలు రద్దు
అమెరికాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు (Thunderstorms in USA) కురుస్తున్నాయి. ఈ కారణంగా దేశవ్యాప్తంగా 2,600కి పైగా ఫ్లైట్‌లను క్యాన్సిల్ చేశారు. 8 వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అమెరికాలోని నార్త్‌ఈస్ట్ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఫ్లైట్ సర్వీస్‌లకు అంతరాయం కలిగినట్టు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA)వెల్లడించింది. న్యూయార్క్‌లోని లిబర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోనే 350కి పైగా విమానాలు రద్దయ్యాయి. విమానాలు ఎగరడానికి అనుకూల వాతావరణం లేకపోవడం వల్ల చాలా వరకూ ఎయిర్‌పోర్ట్‌లోనే నిలిచిపోయాయి. ఎయిర్‌పోర్ట్‌కి వచ్చే ముందుకు వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నయో చూడాలని, ఫ్లైట్ టేకాఫ్ అవుతుందని సమాచారం ఉంటే తప్ప ఎవరూ ఇక్కడికి రావద్దని అధికారులు సూచించారు. అమెరికాలోని నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో భారీ వానల కారణంగా వరదలు ముంచెత్తుతున్నాయి. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, పెన్సిల్వేనియా, వెర్మాంట్ సహా తదితర ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వరదలు వచ్చే అకాశముందని అధికారులు హెచ్చరించారు.
భారీ ప్రాణనష్టం..?
ప్రాణనష్టమూ భారీగా వాటిల్లే ప్రమాదముందని అంచనా వేస్తున్నారు. పలు చోట్ల తుపాను విరుచుకు పడుతుందని National Weather Service (NWS) స్పష్టం చేసింది. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే...దక్షిణ, పశ్చిమ అమెరికాల్లో మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. అక్కడ ఉష్ణోగ్రతలు సతమతం చేస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడిగాలులు వీచే ప్రమాదముందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. రానున్న వారం రోజుల్లో ఈ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయని వెల్లడించారు. చాలా మందికి అనారోగ్యమూ కలిగే ప్రమాదముందని తెలిపారు. ఇప్పటికే కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీలో 52 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ నమోదైంది. అమెరికాలోని ప్రధాన నగరాల ప్రజలు వేడిగాలుల్ని తట్టుకోలేకపోతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.
ఇటలీలోనూ...
అటు ఐరోపాలోనూ ఇవే పరిస్థితులున్నాయి. కాకపోతే...ఇక్కడ కారణాలు వేరు. ఇటలీలోని ఎయిర్‌లైన్ ఉద్యోగులు స్ట్రైక్‌కి పిలుపునిచ్చారు. ఒక్క ఇటలీలోనే దాదాపు వెయ్యి ఫ్లైట్‌లు రద్దయ్యాయి. ఫలితంగా వందలాది మంది భారతీయులు అక్కడే చిక్కుకుపోయారు. ఇటలీ నుంచి ఢిల్లీకి వచ్చే విమానాలన్నీ రద్దైపోయాయి. ఎయిర్‌పోర్ట్‌ల వద్దే ఇండియన్స్ పడిగాపులు కాస్తున్నారు. టికెట్ డబ్బులు పూర్తిగా తిరిగి ఇవ్వడం లేదు ఇటలీ ఎయిర్‌లైన్స్ యాజమాన్యాలు. అందుకు బదులుగా వాటర్ బాటిల్స్ ఇచ్చి సరిపెట్టుకుంటున్నారని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. కాంట్రాక్ట్‌ల విషయంలో తలెత్తిన విభేదాల వల్ల ఎయిర్‌లైన్స్ నిరసనబాట పట్టాయి. ఈ నిరసనలకు తోడు అక్కడి వాతావరణం కూడా ఫ్లైట్ టేకాఫ్‌లకు అనుకూలంగా లేదు. యూరప్‌లో విపరీతమైన ఉష్ణోగ్రతలున్నాయి. పలు చోట్ల 40-45 డిగ్రీల వరకూ నమోదవుతున్నాయి.
Also Read: Pakisthan News: పాకిస్థాన్‌లో హిందూ దేవాలయాల ధ్వంసం- రాకెట్ లాంచర్లతో దాడి