US Mass Shooting: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. వరుస కాల్పులతో అమెరికా ఉలిక్కిపడుతోంది. చికాగో నగరంలో జరిగిన వివిధ కాల్పుల ఘటనల్లో మొత్తం ఐదుగురు మృతి చెందారు. 16 మందికి గాయాలయ్యాయి.


నైట్‌ క్లబ్‌లో


చికాగోలోని ఇండియానా నైట్‌క్లబ్‌లో తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. చికాగోకు ఆగ్నేయంగా ఉన్న గ్యారీలో తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు.


ప్లేయోస్ నైట్‌క్లబ్ ప్రవేశ ద్వారం వద్ద 34 ఏళ్ల వ్యక్తి, లోపల 26 ఏళ్ల మహిళ మృతదేహాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో మరో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చికాగో పోలీసులు తెలిపారు. కాల్పులు జరగడానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. మరో ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.


మే నెలలో


మే చివరి వారంలో టెక్సాస్ కాల్పులతో దద్దరిల్లింది. టెక్సాస్‌లోని ఓ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో 18 మంది చిన్నారులు సహా మొత్తం 21 మంది మరణించారు. అమెరికా టెక్సాస్‌ రాష్ట్రంలోని ఓ ప్రైమరీ స్కూలులో ఓ టీనేజర్ కాల్పులు జరిపాడు. పాఠశాలలో ఉన్న 18 మంది చిన్నారులు మృతి చెందగా, మరో ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. వెంటనే స్పందించిన పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు.


గతంలో జరిగిన తుపాకీ కాల్పులు



  • 2012- న్యూ టౌన్‌లోని శాండీ హుక్ స్కూల్‌పై దాడి, కాల్పుల్లో 26 మంది మృతి

  • 2016 - టెక్సాస్ ఆల్పైన్ స్కూల్ కాల్పుల్లో ఒక విద్యార్థి మరణించాడు

  • 2018- టెక్సాస్‌లోని సెయింట్ ఫే స్కూల్‌లో కాల్పులు, 17 ఏళ్ల బాలుడు కాల్పులు జరిపాడు, 10 మంది మరణించారు.

  • 2021 - టెక్సాస్‌లోని టింబర్‌వ్యూ స్కూల్‌లో కాల్పులు, కాల్పుల్లో పలువురు గాయపడ్డారు.

  • 2022 - టెక్సాస్ ప్రాథమిక పాఠశాలలో కాల్పులు, 14 మంది పిల్లలు, ఒక ఉపాధ్యాయుడు మరణించారు, 18 ఏళ్ల నిందితుడైన వ్యక్తిని హతమార్చారు.


Also Read: National Herald case: రాహుల్ గాంధీని ఈడీ ఏమడిగిందో తెలుసా?- 3 గంటల పాటు విచారణ


Also Read: World Recession : అమెరికానూ వదలని ధరల పెరుగుదల - ప్రపంచం మొత్తానికి మాంద్యం ముప్పు ?