Boris Johnson Resigns: 'ప్రపంచంలోనే అత్యున్నత పదవిని వదులుకుంటున్నా- అందుకు గర్విస్తున్నా'

ABP Desam Updated at: 07 Jul 2022 05:41 PM (IST)
Edited By: Murali Krishna

Boris Johnson Resigns: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించారు.

'ప్రపంచంలోనే అత్యున్నత పదవిని వదులుకుంటున్నా- అందుకు గర్విస్తున్నా'

NEXT PREV

Boris Johnson Resigns: బ్రిటన్ ప్రధాని పదవికి రాజీనామా చేసినట్లు బోరిస్ జాన్సన్ ప్రకటించారు. అయితే తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్దర్మ ప్రధానిగా కొనసాగనున్నట్లు ఆయన తెలిపారు. దీని కోసం ఆయన నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. 




కన్జర్వేటివ్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం తీవ్ర రాజకీయ సంక్షోభంలో చిక్కుకోవడంతో ఆయన తన పదవికి రాజీనామా సమర్పించారు. అనంతరం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.



నూతన ప్రధాని నియమితుడయ్యే వరకు నేను పదవిలో కొనసాగుతాను. నా వైఫల్యాలకు విచారం వ్యక్తం చేస్తున్నాను. అలానే నా విజయాల పట్ల గర్వపడుతున్నాను. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, ప్రపంచంలోనే అత్యున్నత పదవిని నేను వదులుకుంటున్నాను.                                                    - బోరిస్ జాన్సన్


కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు, మంత్రివర్గ సహచరుల పిలుపును శిరసావహిస్తూ తాను ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు బోరిస్ తెలిపారు.


ఇదే కారణం






 

రేసులో రిషి

 

ఇప్పటివరకు బ్రిటన్ ఆర్థిక మంత్రిగా బాధ్యతుల నిర్వర్తించిన రిషి సునక్.. ప్రధాని రేసులోకి వచ్చారు. మనందరికీ సుపరిచితులైన ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తికి రిషి స్వయానా అల్లుడు. నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తిని సునక్ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కృష్ణా సునక్, అనౌష్క సునక్ ఉన్నారు.


కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక మంత్రిగా రిషి సునక్.. తీసుకున్న చర్యలకు మంచి పేరు వచ్చింది. ఆయన నిర్ణయాల వల్లే బ్రిటన్ ఆర్థికంగా కోలుకోగలిగిందని మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ఎన్నో సార్లు చెప్పారు. 


కరోనా మహమ్మారి సమయంలో వ్యాపారులు, కార్మికుల కోసం 10 బిలియన్ పౌండ్ల విలువైన భారీ ప్యాకేజీని ప్రకటించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు.


Also Read: Rishi Sunak Profile: ఇంగ్లాండ్ ప్రధాని రేసులో ఇండియా సంతతి వ్యక్తి- రిషి సునక్ ఎవరో తెలుసా?


Also Read: Bihar Professor Salary Return: 33 నెలల జీతాన్ని ప్రభుత్వానికి తిరిగిచ్చేసిన ప్రొఫెసర్- రూ.24 లక్షలు భయ్యా!





Published at: 07 Jul 2022 05:39 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.