ABP  WhatsApp

Bihar Professor Salary Return: 33 నెలల జీతాన్ని ప్రభుత్వానికి తిరిగిచ్చేసిన ప్రొఫెసర్- రూ.24 లక్షలు భయ్యా!

ABP Desam Updated at: 07 Jul 2022 05:03 PM (IST)
Edited By: Murali Krishna

Bihar Professor Salary Return: ఓ ప్రొఫెసర్ ఏకంగా తాను తీసుకున్న 33 నెలల జీతాన్ని తిరిగి యూనివర్సిటీకి ఇచ్చేశారు.

(Image Source: Pixabay)

NEXT PREV

Bihar Professor Salary Return: జీతం ఎప్పుడెప్పుడు పడుతుందా? అని నెల మొత్తం ఎదురుచూస్తూ ఉంటాం. అలాంటిది ఓ ప్రొఫెసర్ మాత్రం ఏకంగా తన 33 నెలల జీతాన్ని తిరిగి ఇచ్చేశారు. అవాక్కయ్యారా? అవును అక్షరాలా రూ.24 లక్షలను ఆయన వెనక్కి ఇచ్చేశారు.






ఇదీ జరిగింది


బిహార్‌కు చెందిన 33 ఏళ్ల లలన్‌ కుమార్ ముజఫర్‌పుర్‌లోని ఓ ప్రభుత్వ కళాశాలలో ప్రొఫెసర్​గా పనిచేస్తున్నారు. ఈయన దిల్లీలోని జవహార్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ నుంచి హిందీలో మాస్టర్స్, దిల్లీ యూనివర్శిటీ నుంచి పీహెచ్‌డీ, ఎంఫిల్‌ చేశారు.


చదువు పూర్తయిన తర్వాత ముజఫర్‌పుర్‌లోని నితీశ్వర్‌ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేశారు. ఇది బీఆర్‌ అంబేడ్కర్‌ బిహార్‌ యూనివర్శిటీ (బీఆర్‌ఏబీయూ) అనుబంధ కళాశాల. 2019 సెప్టెంబరులో లలన్‌ ఉద్యోగంలో చేరారు, అయితే ఆ తర్వాత కొన్నాళ్లకే కరోనా వ్యాప్తి దృష్ట్యా లాక్‌డౌన్‌ రావడం వల్ల కాలేజీ మూతబడింది. ఆన్‌లైన్‌ క్లాసులు ఏర్పాటు చేసినప్పటికీ విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో లలన్ తన 33 నెలల జీతాన్ని యూనివర్సిటీ రిజిస్టార్‌కు తిరిగిచ్చేశారు.


అంతరాత్మ



ఈ కాలేజీలో చేరినప్పటి నుంచి ఒక్కరోజు కూడా పూర్తిగా పాఠాలు బోధించలేకపోయాను. ఆన్‌లైన్‌ క్లాసులు జరిగినప్పటికీ విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. పాఠాలు చెప్పనప్పుడు జీతం తీసుకొనేందుకు నా అంతరాత్మ అంగీకరించలేదు. అందుకే జీతాన్ని తిరిగిచ్చేశా. అందుకే ఈ 33 నెలలకు జీతంగా తీసుకున్న రూ.23,82,228 మొత్తాన్ని చెక్కు రూపంలో ఇచ్చేశా.                                                   -   లలన్ కుమార్, బిహార్ ప్రొఫెసర్


విమర్శలు


ఇంత మంచి పని చేసిన లలన్‌పై విమర్శలు కూడా వస్తున్నాయి. ఆయన ఇటీవల పీజీ డిపార్ట్‌మెంట్‌లో బదిలీకి అభ్యర్థన పెట్టుకున్నారట. దీనిలో భాగంగానే యూనివర్శిటీపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ చర్యకు పాల్పడ్డాడని నితీశ్వర్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ ఆరోపించారు.


Also Read: Big Blow to Uddhav Thackeray: ఠాక్రేకు షాక్ మీద షాక్! శివసేన నుంచి శిందే గ్రూపులోకి 66 మంది కార్పొరేటర్లు జంప్!


Also Read: UK Prime Minister Resignation: బ్రేకింగ్ న్యూస్- బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా!

Published at: 07 Jul 2022 05:00 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.