Bhagwant Mann Wedding: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్.. డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ను పరిణయమాడారు. చండీగఢ్‌లోని గురుద్వారాలో నిరాడంబరంగా ఆయన వివాహం జరిగింది. ఈ పెళ్లికి దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అతికొద్ది మంది సమక్షంలో ఈ వివాహం జరిగింది.
శుభాకాంక్షలు
పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్న భగవంత్ మాన్ ఫోటోను ఆప్ నేత రాఘవ్ చద్దా ట్విట్టర్‌లో పోస్టు చేశారు. బంగారు వర్ణం దుస్తులు, పసుపు రంగు టర్బన్‌ను ధరించి పంజాబ్ సీఎం మెరిసిపోయారు.
భగవంత్‌మాన్ వివాహం సిక్కుల సంప్రదాయం ప్రకారం నిరాడంబరంగా జరిగింది. ఆయన తల్లి, సోదరి, అతికొద్ది మంది అతిథులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ రోజు నుంచి కొత్త జీవితం ప్రారంభించబోతున్న భగవంత్ మాన్‌కు శుభాకాంక్షలు అని కేజ్రీవాల్ మీడియాకు తెలిపారు. కేజ్రీవాల్ కుటుంబంతో పాటు ఇతర పార్టీ నేతలు ఈ వేడుకకు వెళ్లారు.
విందులో
సీఎం భగవంత్ పెళ్లిలో అతిథులకు ఘుమఘులాడే రకరకాల వంటకాలను పెట్టారు. భారతీయ, ఇటాలియన్ వంటలు సిద్ధం చేశారు. ఇంకా ఏమున్నాయంటే
- నవరత్న బిర్యానీ
- మౌసమీ సబ్జీలు
- ఆప్రికాట్ స్టఫ్డ్ కోఫ్తా
- కరాహీ పనీర్
- తందూరి కుల్చే
- దాల్ మఖానీ
- లసగ్న సిసిలియానో,
- బుర్రానీ రైత
Also Read: Bhagwant Mann Marriage: పంజాబ్ సీఎం పెళ్లాడిన అమ్మాయి గురించి ఈ విషయాలు తెలుసా?
Also Read: UK political crisis: యూకేలో మహారాష్ట్ర పాలిటిక్స్ రిపీట్- కానీ చిన్న ట్విస్ట్ ఏంటంటే?