Smriti Irani Jyotiraditya scindia: మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, జ్యోతిరాదిత్య సింధియాకు అదనపు బాధ్యతలు అప్పగించింది.


మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీకి అదనంగా మైనార్టీ సంక్షేమ శాఖను అప్పగించారు. మరో మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఉక్కు, గనుల శాఖను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.






వారి రాజీనామా


కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి.. ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ తన పదవికి బుధవారం రాజీనామా చేశారు. రాజ్యసభ ఎంపీగా గురువారం ఆయన పదవీ కాలం ముగుస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.


నఖ‍్వీతో పాటుగా రామ్ చంద్ర ప్రసాద్ సింగ్ కూడా రాజీనామా చేశారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ సలహా మేరకు.. కేబినెట్ మంత్రి స్మృతి ఇరానీకి ప్రస్తుతం ఉన్న పోర్ట్‌ఫోలియోతో పాటు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కూడా కేటాయించాలని రాష్ట్రపతి ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. 


అందుకేనా


కేంద్ర మైనార్టీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రిగా కొన‌సాగిన న‌ఖ్వీ.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి రాజ్య‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. గురువారంతో ఆయ‌న రాజ్య‌స‌భ ప‌ద‌వీకాలం కూడా ముగియ‌నుంది. ప్ర‌ధాని మోదీ కేబినెట్‌లో కేంద్ర‌మంత్రులుగా కొన‌సాగుతున్న‌ రాజ్‌నాథ్ సింగ్, ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీ.. అట‌ల్ బిహారీ వాజ్‌పేయీ గ‌వ‌ర్న‌మెంట్‌లో కూడా కేబినెట్ మంత్రులుగా ప‌ని చేశారు.


ఉపరాష్ట్రపతిగా


మరోవైపు నఖ్వీకి రాజ్యసభ కోసం మరో ఛాన్స్ ఇవ్వకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనను రానున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ తరఫున అభ్యర్థిగా బరిలోకి దింపే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.


Also Read: Corona Cases: దేశంలో కొత్త ఒమిక్రాన్ సబ్ వేరియంట్- తాజాగా 18,930 మందికి కరోనా


Also Read: Edible Oil Price Today: లీటర్ నూనెపై రూ.10 తగ్గించండి, కంపెనీలకు సూచించిన కేంద్రం