ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయ రాజా, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌, పీటీ ఉష, అలానే కర్ణాటకకు చెందిన వీరేంద్ర హెగ్డేలను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది. రాష్ట్రపతి కోటాలో వీరిని రాజ్యసభకు నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. రాజ్యసభకు నామినేట్ అయిన వీరిని ప్రధాని నరేంద్ర మోడీ అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు. 


ముందుగా విజయేంద్రప్రసాద్ ని ఉద్దేశిస్తూ.. 'శ్రీ వి.విజయేంద్ర ప్రసాద్ గారు ఎన్నో ఏళ్లుగా క్రియేటివ్ వరల్డ్ తో కలిసి పని చేస్తున్నారు. ఆయన రచనలు భారతదేశ సంస్కృతిని ప్రదర్శించేలా ఉంటాయి. వాటితో ప్రపంచవ్యాప్తంగా మార్క్ ను క్రియేట్ చేయగలిగారు. రాజ్యసభకు నామినేట్ అయినందుకు ఆయనకు అభినందనలు' అంటూ రాసుకొచ్చారు మోడీ. 


అలానే ఇళయరాజాను ఉద్దేశిస్తూ.. 'క్రియేటివ్ జీనియస్ ఇళయరాజా.. తరరాలుగా ప్రేక్షకులను తన సంగీతంతో అలరిస్తున్నారు. ఆయన వర్క్ అన్ని రకాల ఎమోషన్స్ ను రిఫ్లెక్ట్ చేస్తుంది. అతడి లైఫ్ జర్నీ కూడా అంతే ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది. నిరాడంబరమైన బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన ఆయన ఎంతో సాధించారు. ఆయన రాజ్యసభకు నామినేట్ కావడం సంతోషంగా ఉంది' అంటూ ట్వీట్ చేశారు మోడీ.