సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ పై గాసిప్స్ వినిపించడం కామన్. ఒకే హీరోతో రెండు, మూడు సినిమాలు చేశారంటే.. కచ్చితంగా ఎఫైర్ ఉందంటూ వార్తలు పుట్టుకొస్తాయి. అందుకే సెలబ్రిటీలు ఇలాంటి రూమర్స్ ను పెద్దగా పట్టించుకోరు. నిజంగానే క్లారిటీ ఇవ్వాలనుకుంటే మాత్రం సోషల్ మీడియా వేదికగా ఇస్తారు. కానీ చాలా మంది లైట్ తీసుకుంటారు. హీరోయిన్ లావణ్య త్రిపాఠికి సంబంధించి కూడా ఓ వార్త హల్చల్ చేసింది. 

 

మెగాహీరో వరుణ్ తేజ్ తో ఆమె డేటింగ్ చేస్తోందని.. త్వరలోనే ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరిగింది. కానీ ఇందులో నిజం లేదని చెబుతోంది లావణ్య త్రిపాఠి. ఆమె నటించిన 'హ్యాపీ బర్త్ డే' సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న లావణ్య త్రిపాఠి తన పెళ్లి వార్తలపై స్పందించింది. నిజానికి ఈ వెడ్డింగ్ న్యూస్ తన నోటీస్ కి రాలేదని చెప్పింది. ఫైనల్ గా అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేసింది. 

 

తన చేతికి ఉన్న డైమండ్ రింగ్ కూడా ఎవరూ గిఫ్ట్ ఇవ్వలేదని.. తనే కొనుక్కున్నట్లు చెప్పింది. ఇక తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. టాప్ లీగ్ లోకి వెళ్లకపోయినా.. 'చావు కబురు చల్లగా' లాంటి సినిమాల్లో చేసిన క్యారెక్టర్స్ తనకు సంతృప్తినిచ్చాయని తెలిపింది. త్వరలోనే ఈ బ్యూటీ వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతుంది.