భారత రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలతో వివాదం రేగడంతో కేరళ సాంస్కృతిక శాఖ మంత్రి సాజీ చెరియన్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. అంతకుముందు బుధవారం, తిరువనంతపురంలోని కేరళ అసెంబ్లీ వెలుపల కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ ప్రతిపక్ష నాయకులు ఇదే అంశంపై ఆందోళన చేపట్టారు. సభ వాయిదా అనంతరం వాళ్లంతా సభ బయట నిరసన చేపట్టారు.
"నేను రాజీనామా చేశాను. ఇది నా వ్యక్తిగత నిర్ణయం. నేను ఎన్నడూ రాజ్యాంగాన్ని కించపరచలేదు. ప్రసంగంలోని ఒక నిర్దిష్ట భాగం తీసుకొని కొందరు రాద్దాంతం చేస్తున్నారు. సీపీఎం, ఎడీఎప్‌ను బలహీనపరిచేందుకు దీన్ని సృష్టించారు." అని సాజి చెరియన్ ఏఎన్‌ఐకి చెప్పారు.