Corona Cases: దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. కొత్తగా 18,930 కరోనా కేసులు నమోదయ్యాయి. 35 మంది మృతి చెందారు. తాజాగా 14,650 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.


రికవరీ రేటు 98.53 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసులు 0.26 శాతం ఉన్నాయి.






కొత్త వేరియంట్


మరోవైపు కరోనా ఒమిక్రాన్​ కొత్త సబ్ వేరియంట్ బీఏ 2.75 భారత్​లో వెలుగుచూసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. తొలుత భారత్​లో కనిపించిన ఈ వేరియంట్.. ఇప్పటివరకు 10 దేశాల్లో బయటపడ్డట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. 



  • డైలీ పాజిటివిటీ రేటు: 4.32 శాతం

  • మొత్తం మరణాలు: 5,25,305

  • యాక్టివ్​ కేసులు: 1,19,457

  • మొత్తం రికవరీలు: 4,29,21,977


వ్యాక్సినేషన్







దేశంలో కొత్తగా 11,44,489 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,98,33,18,772కు చేరింది. మరో 4,38,005 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. కరోనా మార్గదర్శకాలను తప్పక పాటించాలని కోరింది. మాస్కులు ధరించాలని సూచించింది.


Also Read: Edible Oil Price Today: లీటర్ నూనెపై రూ.10 తగ్గించండి, కంపెనీలకు సూచించిన కేంద్రం


Also Read: Kerala Minister Resigns: రాజ్యాంగంపై వివాదాస్పద కామెంట్స్- రాజీనామా చేసిన కేరళ మంత్రి