పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ని పెళ్లాడారు. చండీగఢ్‌లోని సొంతింట్లో ఈ వివాహం జరిగింది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ వేడుకకు హాజరయ్యారు. పెద్దగా హంగు ఆర్భాటాలకు పోకుండా కుటుంబ సభ్యుల మధ్య చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. "వివాహం చేసుకుంటున్న నా సోదరుడు భగవంత్ మాన్, డాక్టర్ గురుప్రీత్ కౌర్‌కు అభినందనలు" అని విషెస్ చెప్పారు. అయితే సీఎంను పెళ్లాడుతున్న అమ్మాయి ఎవరా అని అందరూ ఆరా తీస్తున్నారు. ఇప్పుడు గూగుల్‌లో ఆమె పేరు ట్రెండ్ అవుతోంది.
ఇంతకీ ఎవరీ గురుప్రీత్ కౌర్..?
1. గురుప్రీత్ కౌర్...హరియాణాలోని కురుక్షేత్ర జిల్లాలో పెహోవా అనే గ్రామంలో జన్మించారు.
2. అంబాలా జిల్లాలోని మహారిషి మార్కండేశ్వర్ యూనివర్సిటీ మెడికల్ కాలేజ్‌లో మెడిసిన్ చదివారు.
నాలుగేళ్ల క్రితం ఎంబీబీఎస్ పూర్తి చేశారు.
3. గురుప్రీత్ కౌర్‌ను, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గోపి అని పిలుస్తారట.
4. మొహాలీలో ఫ్యామిలీతో ఉంటున్న గురుప్రీత్ కౌర్, ప్రస్తుతానికి డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్నారు.
5. పెహోవాలోని మదన్‌పూర్ విలేజ్‌లో గురుప్రీత్ కౌర్ తండ్రి ఇంద్రజిత్ సింగ్‌కు ఓ ప్రాపర్టీ ఉందట.
6. ఆమె తండ్రి ఇంద్రజిత్ సింగ్ మదన్‌పూర్ విలేజ్ సర్పంచ్‌గా పని చేశారు. సంవత్సరం క్రితం
మొహాలీకి షిఫ్ట్ అయ్యారు.
7. గురుప్రీత్ కౌర్ అంకుల్ ఆప్ పార్టీలో సభ్యులు. భగవంత్ మాన్‌తో వివాహం విషయమై దాదాపు
రెండు సంవత్సరాలుగా రెండు కుటుంబాల మధ్య చర్చలు నడుస్తున్నాయట.
8. ఈ ఇద్దరి కుటుంబాల మధ్య దాదాపు నాలుగేళ్ల పరిచయం ఉందని సన్నిహితులు చెబుతున్నారు.