గోధుమల నుంచి గోధుమ పిండి వస్తుంది, రాగుల నుంచి రాగి పిండి, బియ్యం నుంచి బియ్యంపిండి, రవ్వ వస్తాయి. మరి మైదా పిండి దేనితో తయారవుతుంది? ఎప్పుడైనా ఈ విషయాన్ని ఆలోచించారా? ఆ విషయం చాలా మందికి తెలియదు. కానీ ఈ పిండితో స్వీట్లు, కేకులు, బ్రెడ్డులు.... ఇలా అనేకం చేసుకుని తినేస్తాం. మైదా పిండిని వాడడం వల్ల ఎన్నో అనారోగ్యాలు వస్తాయని ఎప్పట్నించో చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయినా దీన్ని వాడుక మాత్రం తగ్గించడం లేదు ప్రజలు. అసలు మైదా పిండి దేనితో, ఎలా తయారుచేస్తారో తెలుసుకుంటే, దాంతో వండిన వంటలు ఎందుకు తినకూడదో మీకే అర్థమవుతుంది.
మైదాపిండి తయారీ ఇలా...
గోధుమ పిండిని చేసేటప్పుడు గోధుమలను నేరుగా మిల్లులో వేసి పిండి చేస్తారు. అందులో ఎలాంటి రసాయనాలు కలపరు. బియ్యంపిండి అయినా అంతే. అందుకే వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి హానికరమైన మార్పులేవీ జరగవు. కానీ మైదా పిండిని మాత్రం మిల్లులో బాగా పోలిష్ చేసిన గోధుమల నుంచి తయారుచేస్తారు. పాలిష్ లో భాగంగా గోధుమల పైపొరలను చాలా వరకు తీసేస్తారు. పోషకాలు ఉండేదే పై పొరల్లో. అలా పైపొరలు తీసేసిన గోధుమలను పిండి ఆడతారు. ఆ పిండి గోధుమ రంగులో ఉంటుంది. దాన్ని తెల్లగా చేసేందుకు అజోడికార్బోనోమైడ్, క్లోరీన్ గ్యాస్, బెంజోల్ పెరాక్సైడ్ వంటి రసాయనాలను జోడిస్తారు. చివరలో పొటాషియం బ్రోమేట్‌ను కలుపుతారు. అప్పుడు మైదా చాలా స్మూత్ గా, తెల్లగా అవుతుంది.
దీని ధర కూడా గోధుమ పిండి కన్నా చాలా తక్కువ ధరకే లభిస్తుంది. అందుకే హోటల్స్ లో పూరీని అధికంగా చేస్తారు. అలాగే బోండాలు వండుతారు. కొన్ని గారెలు, ఇడ్లీల్లో కూడా మైదాను మిక్స్ చేస్తున్నారు.
మైదా ఒక బూడిద
మైదా బూడిదతో సమానం. దాన్ని తినడం వల్ల కాస్త కూడా ఉపయోగం ఉండదు. ఆరోగ్యప్రయోజనలేవీ కలగవు సరికదా క్యాన్సర్ వంటి రోగాల కారకంగా కూడా మారే అవకాశం ఉంది. దీని తయారీలో వాడే బ్రోమేట్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని నిషేధం కూడా విధించారు. చాలా కీటకాలు మైదా తిని చనిపోతాయి. అంటే ఇదెంత ప్రమాదకరమైనదో అర్థం చేసుకోవచ్చు. మైదా పిండిని నీటిలో కలిపి గోడలకు పోస్టర్లు అతికించడానికి ఉపయోగిస్తారు.
మైదాతో చేసే వంటలు ఇవే...
రవ్వదోసెలు, పరోటా, రుమాలీ రోటీ, కేకులు, కాజాలు, జిలేబీలు, హల్వాలు, బొబ్బట్లు, బ్రెడ్ వంటి వాటిలో మైదాతో అధికంగా చేస్తారు. వీటిని నిత్యం తినేవారి శరీరం క్రమంగా కృశించి పోతుంది.
Also read: మీ పిల్లలు ఎత్తు పెరగాలా? రోజూ వారితో ఇవి తినిపించండి
Also read: శుత్రిహాసన్‌కు పీసీఓఎస్ సమస్య? ఈ సమస్య ఉంటే గర్భం దాల్చలేరా? చికిత్స ఉందా?