శ్రుతి హాసన్ తనకున్న ఆరోగ్యసమస్యల గురించి ఇన్‌స్టాలో పోస్టు చేసింది. అప్పట్నించి ఆమె ఆరోగ్యంపై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆమె ఆరోగ్యం బాగోలేదని, ఆసుపత్రిలో చేరిందని ఇలా అనేక పుకార్లు వచ్చాయి. అవన్నీ తప్పని చెప్పింది శ్రుతి. తాను ఆసుపత్రిలో చేరలేదని స్పష్టం చేసింది. కానీ ఆమెకు పిసీఓఎస్, ఎండోమెట్రియోసిస్ అనే సమస్యలు ఉన్నట్టు స్పష్టంగా పోస్టులో పెట్టింది. వీటి వల్లే తాను ఇబ్బంది పడుతున్నట్టు చెప్పింది. అసలేంటీ పీసీఓఎస్, ఎండోమెట్రియోసిస్? ఈ సమస్యలు ఉంటే పిల్లలు పుట్టడం కష్టమా? వీటికి చికిత్స ఉందా?


గర్భం దాల్చడం కష్టమే
పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. దీనికారణంగా ప్రపంచంలోని పది శాతం మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఇది స్త్రీల అండాశయాలను ప్రభావం చేసే ఒక అనారోగ్య పరిస్థితి. ఈ సమస్య ఉన్న వారిలో పురుష హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల హార్లోన్ల అసమతుల్యత ఏర్పడి రుతుక్రమం సరిగా రాదు. అంతేకాదు అండాలు విడుదలవ్వడం తగ్గిపోతుంది. తద్వారా గర్భం ధరించడం కూడా చాలా కష్టమైపోతుంది. ఒకవేళ గర్భం ధరించినా అది ఎంతో కాలం నిలవకపోవచ్చు. అలాగే మధుమేహం, విపరీత ప్రవర్తన, అధికంగా జుట్టు పెరగడం వంటి సమస్యలు పెరుగుతాయి. 


పీసీఓఎస్ లక్షణాలు ఇలా ఉంటాయి
1. రుతుక్రమం సరిగా రాదు
2. అధిక క్తస్రావం జరుగుతుంది. 
3. బరువు పెరుగుతారు.
4. మొటిమలు వస్తాయి
5. తలమీద జుట్టు రాలిపోతుంది 
6. చర్మం నల్లబడుతుంది
7. ముఖం, ఛాతీ, వీపు ఇలాంటి జుట్టు అధికంగా పెరుగుతుంది. 


ఎందుకు వస్తుంది?
పీసీఓఎస్ సమస్య ఎందుకు వస్తుందో కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. దానికి చాలా కారణాలు ఉండే అవకాశం ఉంది. వంశపారంపర్యంగా వచ్చే ఛాన్సులు కూడా ఉన్నాయి. అండాశయాలు అధికంగా ఆండ్రోజెన్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఆండ్రోజెన్ అనేది మగ హార్మోను. దీని స్థాయి పెరగడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. 


చికిత్స...
దీనికి ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవాల్సిన అవసరం లేదు. వైద్యుడు చెప్పిన మందులు వేసుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. వ్యాయామాలు చేయాలి. శరీర బరువు పెరగకుండా చూసుకోవాలి. కార్భహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలి. ఈ సమస్య లక్షణాలను తగ్గించడం ద్వారా దీనికి చికిత్స చేస్తారు. దీన్ని పూర్తిగా నివారించడం కుదరదు. 


పీసీఓఎస్ సమస్యతో ఉన్న మహిళలు ఎప్పటికప్పుడు హైబీపీ, టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకోవాలి.  



Also read: ఈ ఉల్లిపాయ మగవారు తింటే ఆ విషయంలో తిరుగుండదట!




Also read: జనరిక్ మందులు అంటే ఏమిటో తెలుసా? అవెందుకు తక్కువ ధరకే దొరకుతాయంటే