UK Prime Minister Resignation: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేశారు. తన ప్రభుత్వంలో 40 మందికి పైగా మంత్రులు రాజీనామా చేయడంతో బోరిస్ ఈ నిర్ణయం తీసుకున్నారు.






అయితే ప్రధానిగా బోరిస్‌ వారసుడిగా పార్టీ ఎవరిని ప్రతిపాదిస్తుందో ఇంకా తెలియాల్సి ఉంది. ఈ మేరకు అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. భారత సంతతికి చెందిన రిషి సునక్, పాక్ మూలాలున్న సాజిద్ జావిద్‌లతో మొదలైన రాజీనామాల పర్వం తర్వాత పీక్ స్టేజ్‌కు చేరింది. బోరిస్ జాన్సన్ నాయకత్వంపై నమ్మకంపై పోయిందంటూ బుధవారం ఏకంగా 15 మంది మంత్రులు రాజీనామా చేశారు.


40కి పైగా


మంత్రులతో పాటు దౌత్యాధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా వరుస పెట్టి రాజీనామాలు చేస్తున్నారు. గురువారం నాటికి ప్రభుత్వాన్ని వీడిన వారందరి సంఖ్య 40 దాటింది. 


వరుస రాజీనామాలతో జాన్సన్‌ మెడపై రాజీనామా కత్తి వేలాడింది. ఆయన రాజీనామాకు సొంత పార్టీ ఎంపీల నుంచే ఒత్తిడి పెరిగింది. జాన్సన్‌ తక్షణం తప్పుకోవాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. దీంతో జాన్సన్ చేసేదేం లేక రాజీనామాకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అయితే అంతకుముందు మాత్రం రాజీనామా చేసే ప్రసక్తే లేదని జాన్సన్ అన్నారు.


" 2019 ఎన్నికల్లో ప్రజలు నాకు భారీ మెజారిటీ కట్టబెట్టింది ఇలా అర్ధాంతరంగా తప్పుకునేందుకు కాదు. సమస్యలను అధిగమించి పరిస్థితిని చక్కదిద్దుతా. అందుకోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమే. కానీ రాజీనామా మాత్రం చెయ్యను.                                                                   "




-బోరిస్ జాన్సన్, బ్రిటన్ ప్రధాని



ఇదే కారణమా?








 

కొంతకాలంగా ప్రధాని జాన్సన్‌ పనితీరు దారుణంగా ఉంది. ప్రభుత్వం సజావుగా, సమర్థంగా పని చేయాలని ప్రజలు ఆశిస్తారు. ఆ ప్రమాణాలు లోపించాయి అందుకే తప్పుకుంటున్నా. చాలా సందర్భాల్లో మీ వైఖరిని వ్యక్తిగతంగా ప్రశ్నించినా ప్రజాప్రయోజనాల దృష్ట్యా అందరి ముందూ మాత్రం సమర్థించాను. కానీ మౌలికంగా మనిద్దరివీ వేర్వేరు దారులు. ఇలా కలిసి కొనసాగలేమన్న నిర్ధారణకు వచ్చా.                                                                           "
- రిషి సునక్







Also Read: Bhagwant Mann Wedding: పంజాబ్ సీఎం పెళ్లిలో కేజ్రీవాల్- వివాహ భోజనంబు క్రేజీ వంటకంబు!


Also Read: Bhagwant Mann Marriage: పంజాబ్ సీఎం పెళ్లాడిన అమ్మాయి గురించి ఈ విషయాలు తెలుసా?