UK Political Crisis: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్కు షాక్ మీద షాక్ తగులుతోంది. ఆర్థిక మంత్రి రిషి సునాక్, ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్ మంగళవారం రాజీనామా చేయగా.. తాజాగా మరో ఆరుగురు మంత్రులు రిజైన్ చేశారు. దీంతో మొత్తం రాజీనామా చేసిన వారి సంఖ్య 8కి చేరింది.
మొదట శిశు, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విల్ క్విన్స్, రవాణాశాఖ మంత్రి లారా ట్రాట్ రాజీనామా చేశారు. తర్వాత కొద్ది సేపటికే మరో నలుగురు మంత్రులు తమ పదవులకు రాజీనామా సమర్పించారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఉన్నత పదవిలో కూర్చోబెట్టారని వీరు విమర్శించారు. దీంతో తమకు రాజీనామా తప్ప మరో మార్గం లేదని లేఖలో తెలిపారు.
ఇదే కారణమా?
జాన్సన్ నేతృత్వంలో పరిస్థితులు మెరుగు పడే అవకాశాలు ఏ మాత్రమూ లేవని అందుకే రాజీనామా చేస్తున్నట్లు సాజిద్ చెప్పారు.
పార్టీ కొంపముంచిందా?
కరోనా ఉద్ధృతంగా ఉన్న రోజుల్లో అధికార నివాసంలో మందు పార్టీ చేసుకున్నారన్న ఆరోపణలపై జాన్సన్ ఇప్పటికే ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనిపై ఆయన ప్రజలకు క్షమాపణలు కూడా చెప్పారు. ఆ తర్వాత పార్టీలో కూడా ఆయనకు మద్దతు తగ్గిపోతూ వచ్చింది.
Also Read: Mukhtar Abbas Naqvi Resigns: కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా
Also Read: Brazilian Model Killed: ఉక్రెయిన్- రష్యా యుద్ధంలో బ్రెజిల్ మోడల్ మృతి!