Brazilian Model Killed: ఉక్రెయిన్- రష్యా యుద్ధంలో బ్రెజిల్ మాజీ మోడల్ తలిత డు వాల్లె బలైపోయారు. రష్యా బలగాలు చేసిన క్షిపణి దాడిలో 39 ఏళ్ల తలిత మృతి చెందారు. యుద్ధంలో ఎలైట్ స్నైపర్‌గా ఉక్రెయిన్ బలగాలకు ఆమె సాయమందించారు.






క్షిపణి దాడిలో


ఉక్రెయిన్ ఈశాన్య నగరం ఖర్కీవ్‌లో జూన్ 30న జరిగిన క్షిపణి దాడిలో 39 ఏళ్ల తలిత ప్రాణాలు వదిలారు. రష్యా బలగాల తొలి క్షిపణి దాడి తర్వాత బంకర్‌లో మిగిలిపోయిన షూటర్ ఆమె ఒక్కరేనని సమాచారం. ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన ఉక్రెయిన్ మాజీ సైనికుడు డొగ్లస్ బురిగో(40) కూడా క్షిపణి దాడిలో మరణించాడని మీడియా కథనాలు తెలిపాయి. 


మోడల్‌గా


తలిత.. లా చదివారు. మోడల్, నటిగా కొంతకాలం పని చేశారు. ఎన్‌జీవోలతో కలిసి జంతువుల రెస్క్యూ కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఉక్రెయిన్ కంటే ముందు అనేక యుద్ధ కేత్రాల్లో ఆమె పనిచేశారు. ఇరాక్‌లోని కుర్దిస్తాన్ ప్రాంత సాయుధ దళం 'పెష్‌మెర్గాస్'లో ఆమె పనిచేశారు. ఆ సమయంలోనే స్నైపర్‌ షూటింగ్‌లో శిక్షణ పొందారు.


మరోవైపు డాన్‌బాస్‌ను పూర్తిగా చేజిక్కించుకున్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు. తూర్పు ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్‌ కూడా తమ బలగాల చేజిక్కిందని, డాన్‌బాస్‌ ప్రాంతంలోని కీలక ప్రాతాలన్నింటిపైనా తాము పట్టు సాధించామని తెలిపారు. ఇక్కడ పోరాటంలో పాల్గొన్న తమ బలగాలు విజయం సాధించాయని సోమవారం పుతిన్‌ వివరించారు.


 మరోవైపు ఉక్రెయిన్‌లో మాస్కో సేనల స్థితిగతులపై రష్యా అధినేత పుతిన్ సోమవారం రక్షణ మంత్రి సెర్గీ షోయిగును ఆరా తీశారు. యుద్ధభూమిలో మరింత ముందుకు సాగాలని ఆదేశించినట్లు సమాచారం. 


Also Read: Nitish Kumar Meets Lalu Prasad Yadav: విషమంగా లాలూ యాదవ్ ఆరోగ్యం- ప్రధాని మోదీ ఆరా, నితీశ్ పరామర్శ!


Also Read: Mumbai Rains: చెరువులుగా మారిన రహదారులు- మరో 5 రోజులు తప్పదని IMD హెచ్చరిక!