Rishi Sunak : భారత సంతతి వ్యక్తులు ప్రపంచ దేశాల్లో సాధించిన విజయాల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికై కమలా హారిస్ అరుదైన ఘనత సాధించారు. అయితే మరో భారత సంతతి వ్యక్తి ఏకంగా బ్రిటన్ ప్రధాని రేస్ లో నిలిచారు.
I’m standing to be the next leader of the Conservative Party and your Prime Minister.
Let’s restore trust, rebuild the economy and reunite the country. #Ready4Rishi
Sign up 👉 https://t.co/KKucZTV7N1 pic.twitter.com/LldqjLRSgF
రిషి సునక్
రిషి సునక్.. ఇప్పటివరకు ఈయన బ్రిటన్ ఆర్థిక మంత్రిగా బాధ్యతుల నిర్వర్తించారు. మనందరికీ సుపరిచితులైన ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి రిషి స్వయానా అల్లుడు. నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తిని సునక్ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కృష్ణా సునక్, అనౌష్క సునక్ ఉన్నారు. కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక మంత్రిగా రిషి సునక్.. తీసుకున్న చర్యలకు మంచి పేరు వచ్చింది. ఆయన నిర్ణయాల వల్లే బ్రిటన్ ఆర్థికంగా కోలుకోగలిగిందని మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ఎన్నో సార్లు చెప్పారు. కరోనా మహమ్మారి సమయంలో వ్యాపారులు, కార్మికుల కోసం 10 బిలియన్ పౌండ్ల విలువైన భారీ ప్యాకేజీని ప్రకటించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు.
ఎక్కువ అవకాశం
కన్జర్వేటివ్ ప్రభుత్వం నుంచి దాదాపు 40 మంది మంత్రులు, సహాయకులు ఇప్పటికే రాజీనామా చేసి వైదొలిగారు. వారిలో రిషి సునక్ కూడా ఉన్నారు. బోరిస్ నాయకత్వంపై నమ్మకం కోల్పోయామంటూ ఆయనకు రాసిన రాజీనామా లేఖలో రిషి పేర్కొన్నారు.
తదుపరి బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న రిషి కనుక ప్రధాని అయితే ఆ ఘనత సాధించిన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డులకెక్కుతారు. 42 ఏళ్ల రిషి సునక్‌ను ప్రధాని బోరిస్ జాన్స్ ఫిబ్రవరి 2020లో ఎక్స్‌చెకర్ చాన్స్‌లర్‌గా నియమించారు. ఫలితంగా తొలిసారి పూర్తిస్థాయి కేబినెట్ హోదా పొందారు. కరోనా సమయంలో డౌనింగ్ స్ట్రీట్‌లోని జరిగిన ప్రధాని బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నందుకు గాను జరిమానాను కూడా ఎదుర్కొన్నారు. రిషి సునక్ తాతలు పంజాబ్ నుంచి వచ్చారు.