World Red Cross Day 2024: నేడు వరల్డ్ రెడ్ క్రాస్ డే. ప్రతి సంవత్సరం మే 8న రెడ్‌క్రాస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, వివిధ సమస్యల నుంచి ప్రజలను రక్షిస్తూ శాంతిని పెంపొందించడమే దీని లక్ష్యం. అసలు ఈ రెడ్ క్రాస్ డేను ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు? దీని ప్రధాన కర్తవ్యం ఏమిటి? ఈ సంవత్సరం ఏ థీమ్‌తో వస్తున్నారు? వంటి మరిన్ని విషయాలు మనమూ తెలుసుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు ప్రకృతి వైపరీత్యాలు, సాయుధ పోరాటాలు, ఇతర సంక్షోభాలతో సతమతమవుతున్నారు. ఇళ్లతోపాటు కుటుంబ సభ్యులను కోల్పోతున్నారు. కొన్ని దురదృష్టకర సంఘటనలు క్షణాల్లో మనుషుల జీవితాలను మార్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రెడ్‌క్రాస్ అనే సంస్థ సంక్షోభాలతో బాధపడుతున్న ప్రజలను రక్షించేందుకు ఏర్పడింది. ఈ రోజు రెడ్‌క్రాస్ లేదా రెడ్ క్రెసెంట్ అని పిలవబడే ఉద్యమం మానవతా విలువలను గుర్తు చేస్తుంది.
రెడ్ క్రాస్ చరిత్ర:
మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత రెడ్ క్రాస్ శాంతిని పెంపొందించడంలో గణనీయమైన కృషి చేసింది. 1864లో క్రాస్ (Red Cross) ప్రారంభమైంది. 157 ఏళ్ల క్రితం 12 దేశాలు ఈ సంస్థను నెలకొల్పాయి. ప్రపంచ యుద్ధాల సమయంలో ఈ సంస్థ సేవలకుగాను మూడుసార్లు నోబెల్ శాంతి బహుమతి వరించింది. యుద్ధ ప్రాంతంలో గాయపడిన సైనికుల ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడానికి జెనీవాలోని హోటల్‌లో 12 దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. దీనిని మొదటి జెనీవా సమావేశం అంటారు.
1934లో టోక్యోలో జరిగిన 15వ అంతర్జాతీయ సదస్సులో యుద్ధ సమయంలో గాయపడిన సైనికులను రక్షించేందుకు అవసరమైన సూచనలతో రెడ్‌క్రాస్ ట్రూస్ నివేదికను సమర్పించారు. ఈ ప్రతిపాదన తర్వాత 1946లో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అమలులోకి వచ్చింది. 1948లో రెడ్‌క్రాస్ సొసైటీల లీగ్ గవర్నర్స్ బోర్డు రెడ్‌క్రాస్, ఇంటర్నేషనల్ కమిటీ స్థాపకుడు హెన్రీ డ్యునాంట్ జన్మదినం రోజున ‘రెడ్ క్రాస్ డే’ జరుపుకోవాలని ప్రతిపాదించింది ICRC. అప్పటి నుంచి ఏటా మే 8న ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
Also Read : ఆస్తమా ఉన్నవారిని ట్రిగర్ చేసే అంశాలు ఇవే.. అస్సలు తినకూడని ఫుడ్స్ లిస్ట్
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.