Asthma Prevention Tips : ఆస్తమా అనేది దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్య. ఈ వ్యాధి నయం కాదు. అందుకే ఈ వ్యాధిపై ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు.. ప్రతి సంవత్సరం మే 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఆస్తమా దినోత్సవం (World Asthma Day 2024) చేస్తున్నారు. ఆస్తమా సమస్యలు, వ్యాధిని ట్రిగర్ చేసే అంశాలు.. ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి? ఎలాంటివి తినకూడదు వంటి విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ డేని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2016లో దాదాపు 340 మిలియన్ల మంది ప్రజలు ఆస్తమాతో ఇబ్బంది పడ్డారని.. నాలుగు లక్షలకు పైగా చనిపోయారని WHO తెలిపింది.
సరైన అవగాహన లేకనే చాలామందిలో ఈ వ్యాధి ప్రాణాలు హరిస్తుందని గుర్తించి.. దానిపై పలు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. మొట్టమొదటిగా 1998లో ఈ ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని నిర్వహించారు. ఆస్తమాను ఉబ్బసం అంటారు. ఇది ఊపిరితిత్తులలోని శ్వాసనాళాలలో కలిగే దీర్ఘకాలిక వ్యాధి. ఈ సమస్య వలన శ్వాసనాళాలు ఉబ్బి.. ఇరుకుగా మారి.. దగ్గు, గురక, శ్వాసలో ఇబ్బందులు కలిగిస్తాయి. ఎలాంటి పరిస్థితులు దీనిని ట్రిగర్ చేస్తాయి.. ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి? ఎలాంటి ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆస్తమాను ట్రిగర్ చేసే అంశాలు
ఆస్తమాలో వివిధ రకాలు ఉన్నాయి కానీ.. లక్షణాలు అనేవి అందరిలోనూ దాదాపు ఒకే విధంగా ఉంటాయి. గాలినాణ్యత సరిగ్గా లేకుంటే ఆస్తమా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. దుమ్ము, డస్ట్, పుప్పొడి, ఎలుకల ద్వారా కూడా కొందరిలో ఆస్తమా వచ్చే అవకాశముంది. సిగరెట్ పొగ, కెమికల్స్, పర్యావరణ కాలుష్య కారకాలు కూడా ఆస్తమాను ప్రేరేపిస్తాయి. ఫుడ్ అలెర్జీ, స్లీప్ ఆప్మియా, ఊబకాయం, శ్వాసకోశ వ్యాధులు, మందు, సిగరెట్, డ్రగ్స్ ఇలా మొదలైనవన్నీ ఆస్తమాను ట్రిగర్ చేస్తాయి.
ఫుడ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Asthma Day 2024 ఆస్తమాను ఫుడ్ కూడా ట్రిగర్ చేస్తుంది. కాబట్టి తీసుకునే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. తాజా, పోషకాలతో కూడిన ఆహారం తినడం వల్ల ఆస్తమా లక్షణాలు తగ్గుతాయి. దీనివల్ల మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలా అని ఆస్తమాను పూర్తిగా తగ్గించగల ఆహారం లేదు. కానీ తాజా పండ్లు, కూరగాయలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకుంటే ఆరోగ్యప్రయోజనాలు పొందుతారు.
ఆహారంలో పాలు, గుడ్లు వంటి విటమిన్ డి అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. క్యారెట్, ఆకుకూరలు, బీటా కెరోటిన్ అధికంగా ఉండే కూరగాయలు, గుమ్మడి గింజలు, మెగ్నీషియం అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకుంటే ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. ఇవి ఆస్తమా లక్షణాలు పెరగుకుండా హెల్ప్ చేస్తాయి.
ఎలాంటి ఫుడ్స్ తీసుకోకూడదంటే..
డ్రై ఫ్రూట్స్, వైన్లలో ఉండే సల్ఫైట్స్ ఆస్తమా లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. బీన్స్, క్యాబేజి, ఉల్లిపాయలు, గ్యాస్‌ను విడుదల చేసే ఫుడ్స్ కూడా ఉబ్బసాన్ని తీవ్రం చేస్తాయి. ఎందుకంటే ఇవి గ్యాస్‌ను విడుదల చేసి.. ఊపిరితిత్తులపై మరింత ప్రెజర్‌ను ఇస్తాయి. కొన్నిరకాల కెమికల్స్, సాలిసైలేట్లు కలిగిన ఫుడ్స్ తినకపోవడమే మంచిది.
ఆస్తమాకు చికిత్స తీసుకున్న పూర్తిగా తగ్గదు. కాబట్టి.. ఈ దీర్ఘకాలిక వ్యాధిని లైఫ్స్టైల్లోని కొన్ని మార్పులతో కంట్రోల్ చేయవచ్చు. దీనివల్ల మరణాలు దూరమవుతాయి. ఇదే ఉద్దేశంతో ఏటా ఆస్తమా డేను నిర్వహించి.. ప్రజలకు ఈ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.
Also Read : బరువు తగ్గించడంలో, హెల్తీగా ఉంచడంలో హెల్ప్ చేసే ఫుడ్స్ ఇవి.. రెగ్యూలర్ డైట్లో చేర్చుకోండిలా