Bengali Is The Only Indian Language On New Yorks Ballot Papers: అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఓటింగ్ ప్రారంభమయ్యే సమయంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో తెలుగువారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తెలుగు బ్యానర్లను కూడా రాజకీయ పార్టీలు ఏర్పాటు చేశాయి. అలాగే గుజరాతీ సహా అనేక భాషల్లో ఓట్లను అడిగారు. బ్యాలెట్ పేపర్లలో కూడా ఓ బారతీయ భాష ఉంటోంది. అదే బెంగాలీ భాష.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తిగా బ్యాలెట్ పద్దతిలో జరుగుతాయి. ఈ బ్యాలెట్ పేపర్లలో వివరాలు ఇంగ్లిష్‌లో మాత్రమే కాకుండా మరో నాలుగు భాషల్లో ఉంటాయి. చైనీస్, స్పానిష్, కొరియన్‌తో పాటు బెంగాలీ భాషకు చోటిచ్చారు. ఎందుకంటే ఇలా చేయడం కర్టసీ మాత్రమేకాదు.. న్యాయపరమైన అవసరం కూడా అని అమెరికా ఎన్నికల గురించి పూర్తిగా అధ్యయనం చేసిన నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే..గతంలో ఈ అంశంపై ఓ లా సూట్ కోర్టులో దాఖలైంది. ఆ సందర్భంగా అత్యధికంగా మాట్లాడే ఇతర దేశాల భాషలను కూడా ముద్రించాలని కోర్టు రూలింగ్ ఇచ్చింది. ఇలా నిర్ణయం తీసుకోవడానికి కొన్ని వర్గాలతో చర్చలు కూడా జరిపారు. అయితే న్యూయార్క్ బ్యాలెట్స్‌లో మాత్రమే ఈ బెంగాలీ బాష ఉంటున్నట్లుగా తెలుస్తోంది.
అమెరికా అధ్యక్ష భవన్ వైట్ హౌస్‌లో "ఓం జై జగదీష హరే" పాట- సోషల్ మీడియాలో వీడియో వైరల్
అమెరికా ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమయింది. మంగళవారం పోలింగ్ జరగనుంది. బ రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ మధ్యే ప్రధాన పోటీ జరుగుతోంది. అమెరికాలో మొత్తం 27 కోట్ల మంది ఓటర్లుండగా ఎర్లీ ఓటింగ్‌లో భాగంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇప్పటికే 6.8 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మిగిలిన వారు మంగళవాం ఓటేస్తారు. వెంటనే కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. . ట్రంప్,హారిస్ మధ్య పోరు హోరాహోరీగా ఉంటే మాత్రం తుది ఫలితాలు వెలువడేసరికి ఒకటి రెండు రోజులు పడుతుంది. ఎలక్టోరల్ కాలేజీ ఎన్నిక తతంగం పూర్తై అధ్యక్షుడి ప్రమాణస్వీకారం జరగాలంటే 2025 జనవరి 20 దాకా ఆగాల్సి ఉంటుంది. ఒకవేళ జనవరి 20 ఆదివారం అయితే జనవరి 21న ప్రమాణస్వీకారం ఉంటుంది.
అమెరికా ప్రెసిడెంట్‌గా ఎన్నిక కావాలంటే మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో మెజార్టీ తెచ్చుకోలి. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకుగాను 270 ఓట్లు లభించినవారు అధ్యక్షులవుతారు. అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న పార్టీలు ఆయా రాష్ట్రాల్లో తమ ఎలక్టర్లను ముందే నిర్ణయిస్తాయి. ఓటింగ్ సమయంలో మాత్రం ప్రజలు బ్యాలెట్ పేపర్‌పై అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకున్నట్లుగానే ఓటు వేస్తారు. ఎన్నికల్లో పాపులర్ ఓట్లు ఎక్కువగా వస్తే విజయం సాధించలేరు. ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు వస్తేనే అధ్యక్ష ఎన్నికల్లో గెలుస్తారు. సాధించినట్లు. కాలిఫోర్నియాలో అత్యధికంగా 54,టెక్సాస్‌లో 40 ఎలక్టోరల్ ఓట్లుండగా తక్కువ జనాభాగల వ్యోమింగ్‌కు మూడు ఎలక్టోరల్ ఓట్లున్నాయి.