పొరబాటున ఆహారంలో బొద్దింకపడితే వామ్మో.. ఇక ఆ రోజు అన్నం కూడా తినాలంటే.. చిరాకు...కానీ జపాన్ లో మాత్రం వెరీ డిఫరెంట్. అక్కడ తయారు చేసే బొద్దింకల బీర్ కు చాలా డిమాండ్. బొద్దింకల బీర్ తాగితే.. వాళ్లకి వచ్చే మజానే వేరు.  అది ఆరోగ్యం కూడా అంట.


ఎక్కడ పడితే అక్కడ ఈ బీర్ దొరకదండి.. జ‌పాన్‌లో మాత్రమే ఈ స్పెష‌ల్. ఇక ఈ బీరును తయారు చేసేందుకు కూడా అలాంటి ఇలాంటి బొద్దింకలను వాడరు. తైవాన్ లో ఉండే మగ బొద్దింకలతో మాత్రమే తయారు చేస్తారు. ఈ బొద్దింక‌లు..నీళ్లలో నివసించే.. క్రిమి కీటకాలను తిని జీవిస్తాయి. 


బొద్దింకలను నీళ్లలో చాలా రోజుల పాటు ఉడికిస్తారు. వాటి నుంచి వచ్చే జ్యూస్ తో బీర్ తయారు చేస్తారు. జపాన్ లో బీరు త‌యారు చేసేందుకు ఒక సంప్రదాయమైన ప్రక్రియ ఉంటుంది. దాని పేరు ‘క‌బుటోకామా’. ఈ సంప్రదాయ పద్ధతిలోనే.. బీరు త‌యారు చేస్తారు. అక్కడ మ‌గ బొద్దింక‌ల‌కు డిమాండ్ మామూలుగా ఉండదు. దానికి.. కొంచు సోర్ బీర్ అనే పేరు పెట్టి మార్కెట్‌లో అమ్ముతున్నారు. ఒక్కో బీరు బాటిల్‌కు మ‌న క‌రెన్సీలో 300 రూపాయ‌ల వరకు తీసుకుంటున్నారట. 


జపాన్ లో బొద్దింకలను ఫ్రై చేసుకుని తింటారు. ఫ్రైడ్ రైస్ లో వేసుకుని తింటారు. సూపులు తయారు చేస్తారు. వంటకాల్లో గట్టిగా వాడేస్తారు. బొద్దింకలను ఎలా వండినా.. జపాన్ వాసులు తృప్తిగా తింటారు. బొద్దింకలను తినడం వలన ఆరోగ్యంగా ఉంటార‌ని.. పైగా ఆయుషు పెరిగి ఎక్కువ కాలం జీవిస్తార‌ని వారి నమ్మకం. 


Also Read: Char Dham Road Project: చార్‌ధామ్ జాతీయ రహదారి ప్రాజెక్టుకు సుప్రీం గ్రీన్‌ సిగ్నల్


Also Read: PM Modi: కాశీ వీధుల్లో కాలినడకన ప్రధాని మోదీ.. అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు


Also Read: Corona Cases: దేశంలో భారీగా తగ్గి కరోనా వ్యాప్తి.. పెరిగిన ఒమిక్రాన్ కేసులు


Also Read: Elon Musk: అద్దె ఇంట్లో అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్


Also Read: ఈ బ్యాంకు హోమ్‌ , కార్‌ లోన్లపై వడ్డీరేట్లు తగ్గించింది.. ఎంతో తెలుసా?


Also Read: యాదాద్రి ప్రారంభోత్సవానికి రండి.. ,. స్టాలిన్‌ను ఆహ్వానించిన కేసీఆర్ !


Also Read: TS MLC Election Results: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్.. అన్ని స్థానాలు గులాబీ కైవసం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి