ABP  WhatsApp

Sri Lanka Crisis: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయకు ఊరట- వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

ABP Desam Updated at: 17 May 2022 03:44 PM (IST)
Edited By: Murali Krishna

Sri Lanka Crisis: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సపై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.

శ్రీలంక అధ్యక్షుడు గొటబాయకు ఊరట- వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

NEXT PREV

Sri Lanka Crisis:  శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు ఊరట లభించింది. ఆయనపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పార్లమెంటులో మంగళవారం వీగిపోయింది.


119 ఓట్లు


తమిళ్ నేషనల్ అలయెన్స్ (టీఎన్‌ఏ) సభ్యుడు ప్రతిపాదించిన ఈ తీర్మానానికి వ్యతిరేకంగా 119 మంది ఎంపీలు ఓటు వేశారు. దీంతో ఈ తీర్మానం వీగిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. రాజపక్సపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ చర్చించేందుకు వీలుగా పార్లమెంటు స్టాండింగ్ ఆర్డర్స్‌ను సస్పెండ్ చేయాలని ఈ తీర్మానం కోరింది. ఈ తీర్మానానికి అనుకూలంగా కేవలం 68 మంది ఎంపీలు ఓటు వేశారు. 


రెండు నెలలు


మరోవైపు వచ్చే రెండు నెలలు అత్యంత కఠినమైన పరిస్థితులు శ్రీలంక ప్రజలు ఎదుర్కోబోతున్నారని కొత్త ప్రధాని రణిల్ విక్రమసింఘే తెలిపారు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని రక్షించడమే తన లక్ష్యమన్నారు.







దేశంలో పెట్రోల్‌ నిల్వలు నిండుకున్నాయి. ప్రస్తుతం ఒక్కరోజుకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి. దిగుమతులకు చెల్లించడానికి మన దగ్గర సరిపడా డాలర్లు లేవు. అయితే అందుకు అవసరమైన అమెరికా డాలర్లను బహిరంగ మార్కెట్‌ నుంచి సేకరిస్తాం.                                               -      రణిల్ విక్రమసింఘే, శ్రీలంక ప్రధాని


మరో రెండు నెలలపాటు శ్రీలంకలో సంక్షోభం వెంటాడనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడానికి కారణమైన రాజపక్స కుటుంబం గద్దె దిగాలంటూ దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దీంతో ప్రధానమంత్రి మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సూచన మేరకు రణిల్‌ విక్రమ సింఘే ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.


Also Read: Sweden NATO Membership: నాటో కూటమిలో చేరేందుకు స్వీడన్ సై- పుతిన్ స్వీట్ వార్నింగ్


Also Read: Elon Musk Twitter Deal: మస్క్ మామా మజాకా! ట్విట్టర్‌ డీల్‌కు మస్కా కొట్టాడుగా!

Published at: 17 May 2022 03:21 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.