Elon Musk Twitter Deal: మస్క్ మామా మజాకా! ట్విట్టర్‌ డీల్‌కు మస్కా కొట్టాడుగా!

ABP Desam   |  Murali Krishna   |  17 May 2022 02:07 PM (IST)

Elon Musk Twitter Deal: ట్విట్టర్‌ టేకోవర్‌పై ఎలాన్ మస్క్ వెనక్కి తగ్గాడు. ఫేక్ అకౌంట్లపై క్లారిటీ ఇచ్చేవరకు అడుగు కూడా ముందుకు పడదని తేల్చిచెప్పాడు.

మస్క్ మామా మజాకా! ట్విట్టర్‌ డీల్‌కు మస్కా కొట్టాడుగా!

Elon Musk Twitter Deal: 

ట్విట్టర్‌ టేకోవర్‌పై టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ షాకింగ్ ట్వీట్ చేశాడు. ఇలా అయితే ట్విట్టర్‌ డీల్ కుదరదని తేల్చిచెప్పాడు. డీల్‌ను బ్రేక్‌ చేసేందుకు ఓ పాయింట్‌ను పట్టుకున్నాడు.

ఇదీ కథ

ఫేక్‌ ఖాతాలకు సంబంధించి ట్విట్టర్ సరైన సమాచారం ఇవ్వడం లేదని మస్క్ అంటున్నాడు. అంతేకాకుండా దీనిపై స్పష్టత వచ్చే వరకు ట్విట్టర్‌ టేకోవర్‌ చేయడం కుదరదు అని ట్వీట్ చేశాడు. ట్విటర్‌ మొత్తం అకౌంట్లలో ఫేక్‌ ఖాతాలు 5 శాతం ఉంటాయని సీఈవో పరాగ్‌ చెబుతున్నారు. అయితే ఫేక్‌ ఖాతాలు 20 శాతం వరకు ఉంటాయంటూ మస్క్ ఆరోపిస్తున్నాడు. ట్విట్టర్ సీఈఓ చెప్పిన నంబర్‌ కంటే నాలుగు రెట్లు అధికంగా ఫేక్‌ ఖాతాలు ఉన్నాయంటూ మస్క్ ట్వీట్ చేశాడు. 

నిజమైన ఖాతాదారుల సంఖ్యను బట్టే నేను ట్విట్టర్ కొనుగోలుకు 44 బిలియన్‌ డాలర్లు ఇస్తానని ఆఫర్ చేశాను. ఇప్పుడు ఈ కంపెనీ సీఈఓ చెప్పిన సంఖ్యకు నాలుగింతలు ఫేక్‌ ఖాతాలు ఉన్నాయని తేలింది. దీనిపై క్లారిటీ రావాల్సిందే. అప్పటి వరకు ట్విట్టర్ టేకోవర్‌ డీల్‌లో అడుగు ముందుకు పడదు.                                                                 -  ఎలాన్ మస్క్, టెస్లా సీఈఓ

ఎలాన్ మస్క్ చేసిన తాజా ట్వీట్‌తో ట్విట్టర్‌ డీల్‌పై సందేహాలు వస్తున్నాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి మస్క్ ఏం చేస్తాడో చూడాలి.

Also Read: Parag Agrawal On Twitter Spam: పరాగ్ X మస్క్- స్పామ్ అకౌంట్లపై తగ్గేదేలే అంటూ ట్వీట్ వార్!

Also Read: Karti Chidambaram: కార్తీ చిదంబరం ఇల్లు, ఆఫీసుపై సీబీఐ దాడులు- సెటైర్ వేసిన ఎంపీ

 

Published at: 17 May 2022 01:53 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.