Karti Chidambaram:


కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం తనయుడు కార్తీ నివాసం, ఆఫీసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు సోదాలు చేశారు. దిల్లీ, ముంబయి, చెన్నై, తమిళనాడులోని శివగంగలోని పలు ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. 






కార్తీ చిదరంబరంపై నమోదైన కేసుల్లో భాగంగానే దిల్లీ, ముంబయి, చెన్నై, కర్ణాటక, ఒడిశా సహా తొమ్మిది ప్రాంతాల్లో సీబీఐ తనిఖీలు నిర్వహిస్తోంది. 2010-2014 మధ్యకాలంలో కార్తీ చిదంబరం విదేశాలకు నగదు తరలించారని ఆయనపై ఆరోపణలున్నాయి.


ఇదే కేసు


చైనీస్‌ వీసా అంశంపై ఇటీవల కార్తీ చిదరంబరంపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసుపైనే సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. శివగంగ నుంచి ఎంపీగా కార్తీ చిదంబరం కొనసాగుతున్నారు. 


2010-14 మధ్య కాలంలో విదేశీ రెమిటెన్స్‌ల ఆరోపణలపై కార్తీ చిదంబరంపై దర్యాప్తు సంస్థ తాజా కేసు నమోదు చేసింది. కార్తీ చిదంబరం తన తండ్రి ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు రూ.305 కోట్ల మేర విదేశీ నిధులను స్వీకరించినందుకు ఐఎన్ఎక్స్ మీడియాకు ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ క్లియరెన్స్‌కు సంబంధించిన కేసుతో సహా పలు కేసుల్లో విచారణ జరుగుతోంది.


సెటైర్






సీబీఐ దాడులపై కార్తీ చిదంబరం ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. "ఎన్నిసార్లు సోదాలు నిర్వహిస్తారు? ఇప్పటివరకు ఎన్నిసార్లు చేశారో నాకైతే గుర్తులేదు. ఇదో రికార్డ్ అనుకుంట!" అని ట్వీట్ చేశారు.


Also Read: Parag Agrawal On Twitter Spam: పరాగ్ X మస్క్- స్పామ్ అకౌంట్లపై తగ్గేదేలే అంటూ ట్వీట్ వార్!


Also Read: Covid Update: దేశంలో తగ్గిన కరోనా కేసులు- 28 రోజుల తర్వాత 2 వేలకు లోపు!