Covid Update: దేశంలో తగ్గిన కరోనా కేసులు- 28 రోజుల తర్వాత 2 వేలకు లోపు!

Covid Update: దేశంలో కొత్తగా 1,579 కరోనా కేసులు నమోదయ్యాయి. 19 మంది మృతి చెందారు.

Continues below advertisement

Covid Update:

Continues below advertisement

దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. 28 రోజుల తర్వాత కేసులు 2వేలకు దిగువనే నమోదయ్యాయి. కొత్తగా 1,579 కరోనా కేసులు నమోదుకాగా 19 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 4,31,25,370కి పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 16,400కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కరోనా కేసులు: 4,31,25,370
  • మొత్తం మరణాలు: 5,24,260
  • యాక్టివ్​ కేసులు: 16,400
  • రికవరీల సంఖ్య: 4.25,84,710

మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.04గా ఉంది. రికవరీ రేటు 98.75గా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 0.44గా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 0.59గా ఉంది. 

వ్యాక్సినేషన్

దేశవ్యాప్తంగా తాజాగా 10.78 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్‌లు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 191 కోట్ల 48 లక్షల 94 వేలు దాటింది. ఒక్కరోజే 3 లక్షల 57 వేల 484 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. 

కరోనా ఫోర్త్ వేవ్ అంచనాల వేళ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ యోచిస్తోంది. వీలైనంత మందికి వ్యాక్సిన్ అందించాలని కేంద్రం భావిస్తోంది.

Also Read: Mysterious metal balls raining : గుజరాత్‌లో స్కైలాబ్ తరహా ఘటనలు - ఆకాశం నుంచి ఊడిపడుతున్న శకలాలు !

Also Read: Asaduddin Owaisi on Gyanvapi: మరో మసీదును ముస్లింలు వదులుకోరు: ఓవైసీ

 

Continues below advertisement