Asaduddin Owaisi on Gyanvapi: జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడిందనే వార్తలు బయటకు రావడంతో పలువురు నేతలు స్పందిస్తున్నారు. ఈ ఘటనపై ఏఐఎమ్ఐఎమ్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడారు.
జ్ఞానవాపి మసీదు సర్వేను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించిన కొద్ది గంటలకే ఒవైసీ ఓ ట్వీట్‌లో తాజా వ్యాఖ్యలు చేశారు. ట్వీట్‌తో పాటు ఒక వీడియోను కూడా ఆయన షేర్ చేశారు.
సర్వేలో
జ్ఞాన్వాపి మసీదు- శృంగార్ గౌరీ ప్రాంగణంలో మొదలైన వీడియోగ్రఫీ సర్వే ప్రశాంతంగా ముగిసింది. మసీదులో 3 రోజుల సర్వేకు వారణాసి సివిల్ జడ్జి కోర్టు ఆదేశించింది. విచారణకు ఒక రోజు ముందే ఆ ప్రక్రియ పూర్తైంది.
ప్రార్థన స్థలంలోని భూగర్భ నేలమాళిగలు, చెరువు, మూడు గోపురాలను సర్వే బృందం వీడియో తీసింది. అయితే మసీదులోని కొలనులో శివలింగం కనిపించినట్లు పిటిషనర్ల తరపు న్యాయవాది తెలిపారు. ఈ సర్వే నివేదికను అడ్వకేట్ కమిషనర్ మంగళవారం కోర్టులో సమర్పించనున్నారు.
ఇదే కేసు
జ్ఞాన్వాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతామూర్తులకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఐదుగురు మహిళలు వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన వారణాసి సివిల్ జడ్జి కోర్టు అక్కడ వీడియోగ్రఫీ సర్వేకు ఆదేశాలిచ్చారు.
Also Read: Gyanvapi Masjid Case: జ్ఞానవాపి మసీదులో శివలింగం- కీలక ఆదేశాలు జారీ చేసిన కోర్టు!
Also Read: Katwa hospital: ఇదేందిరా ఇది! బిర్యానీ బిల్లు రూ.3 లక్షలా!