Just In





Gyanvapi Masjid Case: జ్ఞానవాపి మసీదులో శివలింగం- కీలక ఆదేశాలు జారీ చేసిన కోర్టు!
Gyanvapi Masjid Case: జ్ఞాన్వాపి మసీదు ప్రాంగణంలో శివలింగం ఉన్నట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు.

Gyanvapi Masjid Case:
ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి సివిల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జ్ఞాన్వాపి మసీదు ప్రాంగణంలో శివలింగం ఉన్నట్లు సమాచారం బయటకు వచ్చినందున ఆ ప్రాంతంలోకి ఎవరినీ వెళ్లనివ్వకుండా సీల్ చేయాలని కోర్టు ఆదేశించింది.
సర్వేలో
జ్ఞాన్వాపి మసీదు- శృంగార్ గౌరీ ప్రాంగణంలో మొదలైన వీడియోగ్రఫీ సర్వే ప్రశాంతంగా ముగిసింది. మసీదులో 3 రోజుల సర్వేకు వారణాసి సివిల్ జడ్జి కోర్టు ఆదేశించింది. విచారణకు ఒక రోజు ముందే ఆ ప్రక్రియ పూర్తైంది.
ప్రార్థన స్థలంలోని భూగర్భ నేలమాళిగలు, చెరువు, మూడు గోపురాలను సర్వే బృందం వీడియో తీసింది. అయితే మసీదులోని కొలనులో శివలింగం కనిపించినట్లు పిటిషనర్ల తరపు న్యాయవాది తెలిపారు. ఈ సర్వే నివేదికను అడ్వకేట్ కమిషనర్ మంగళవారం కోర్టులో సమర్పించనున్నారు.
ఇదే కేసు
జ్ఞాన్వాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతామూర్తులకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఐదుగురు మహిళలు వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన వారణాసి సివిల్ జడ్జి కోర్టు అక్కడ వీడియోగ్రఫీ సర్వేకు ఆదేశాలిచ్చారు.
సంతోషంగా ఉంది
మసీదులో శివలింగ బయటపడిందనే వార్తలపై ఉత్తర్‌ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందించారు.
Also Read: Healthcare In Rural Areas: గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో భారీగా సిబ్బంది కొరత- సర్వేలో షాకింగ్ విషయాలు!
Also Read: PM Modi in Nepal: నేపాల్ పర్యటనలో మోదీ- ప్రముఖ బౌద్ధ క్షేత్రం సందర్శన