PM Modi in Nepal:
ప్రధాని నరేంద్ర మోదీ.. నేపాల్ పర్యటనకు వెళ్లారు. నేపాల్‌తో బంధం మరింత బలోపేతం అయ్యేలా ప్రస్తుత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ప్రధాని మోదీ అన్నారు. బుద్ధపూర్ణిమ సందర్భంగా ఇవాళ నేపాల్‌లోని లుంబిని బౌద్ధ క్షేత్రాన్ని మోదీ సందర్శించనున్నారు. తన పర్యటన సందర్భంగా నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బాతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.
నేపాల్‌తో భారత్ సంబంధాలు అసమానమైనవి. నేపాలీ ప్రధాని షేర్ బహదూర్‌తో సమావేశం కోసం ఎదురు చూస్తున్నాను. గత నెలలో షేర్ బహదూర్ భారత్ వచ్చినప్పుడు ఫలవంతమైన చర్చలు జరిగాయి. ఇరు దేశాల ప్రజల మధ్య కూడా సుహృద్భావం సంబంధాలున్నాయి. నేపాల్‌తో బంధం మరింత బలోపేతం అయ్యేలా ప్రస్తుత ప్రభుత్వంతో కలసి పనిచేస్తాం. - ప్రధాని నరేంద్ర మోదీ
మహామాయాదేవి
పర్యటనలో భాగంగా లుంబినిలో ఉన్న మహామాయాదేవి క్షేత్రాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. ఈ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోదీతో పాటు నేపాల్ ప్రధాని షేర్ బహదూర్, అధికారులు కూడా హాజరయ్యారు.
Also Read: Coronavirus Cases: దేశంలో కొత్తగా 2,202 కరోనా కేసులు- 27 మంది మృతి