Coronavirus Cases: 

దేశంలో కొత్తగా 2,202 కరోనా కేసులు నమోదయ్యాయి. 27 మంది వైరస్‌తో మృతి చెందారు. 2,550 మంది తాజాగా కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 17,317గా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 0.59%గా ఉంది.

  • మొత్తం కరోనా కేసులు: 4,31,23,801
  • మొత్తం మరణాలు: 5,24,241
  • యాక్టివ్​ కేసులు: 17,317
  • మొత్తం రికవరీలు: 42582243

వ్యాక్సినేషన్

దేశంలో తాజాగా 3 లక్షల మందికిపైగా వ్యాక్సిన్‌లు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 191 కోట్ల 37 లక్షల 34 వేలు దాటింది. ఒక్కరోజే 2 లక్షల 97 వేల 242కి కరోనా టెస్టులు నిర్వహించారు.

కిమ్ రాజ్యంలో

ఇటీవల తొలి కరోనా కేసు నమోదైన ఉత్తర కొరియాలో పరిస్థితి దారుణంగా తయారైంది. కరోనా బారినపడి 8 మంది మృతిచెందారు. ‌ప్రస్తుతం 3 లక్షల 92వేల మంది జ్వరం లక్షణాలతో ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కఠిన చర్యలు చేపట్టాలని అధినేత కిమ్ జోంగ్ ఉన్ అధికారులను ఆదేశించారు.

Also Read: Minister Wife's Day Comments: ‘మదర్స్ డే’లాగా భార్యల దినోత్సవం కచ్చితంగా ఉండాలట! ఎందుకో చెప్పిన కేంద్ర మంత్రి

Also Read: Fruits: ఏ పండ్లు తింటే ఏ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చో తెలుసా?