Katwa hospital: ఓ ప్లేట్ బిర్యానీ ఎంతుంటుంది? మహా అయితే రూ. 100 లేదా రూ.200. ఒకవేళ ఫ్యామిలీ ప్యాక్ అయితే రూ.500 వరకు ఉంటుంది. కానీ అక్కడ మాత్రం బిర్యానీ బిల్లు రూ.3 లక్షలట. ఇదేంట్రా బాబు అనుకుంటున్నారా? అసలు ఏం జరిగిందో చూద్దాం.







ఆసుపత్రిలో


బంగాల్‌లోని కత్వా సబ్ డివిజనల్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. శోబిక్ ఆలం అనే వ్యక్తి ఇటీవలే ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన పెండింగ్‌లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలనుకున్నారు. కింగ్ షుక్ గోష్ అనే కాంట్రాక్ట‌ర్ ఫ‌ర్నీచ‌ర్, వాహ‌నాల‌తో పాటు బిర్యానీని స‌ర‌ఫ‌రా చేస్తుంటాడు. వీటన్నింటి ఖర్చులు కలపి సుమారు రూ. కోటి బిల్లు పెట్టాడు. ఇది చూసి షాకైన అధికారి.. బిల్లును పూర్తిగా చెక్ చేసేసరికి అవాక్కయ్యారు.


మొత్తం


అందులో బిర్యానీ కోసం దాదాపు రూ.3 లక్షలు, ఫర్నీచర్‌ కోసం 82 వేలు బిల్లు దాఖలు చేశాడు. దీంతో అనుమానం వచ్చిన సూపరింటెండెంట్ ఆ కాంట్రాక్టర్ సమర్పించిన మొత్తం బిల్లులను పరిశీలించారు. ఆయన సమర్పించిన వాటిలో 81 బిల్లులు బోగస్ అని తెలిసింది.


దీంతో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టు గుర్తించారు ఆ అధికారి. ఈ బోగస్ బిల్లులను డిపాజిట్ చేసిన నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ బిల్లును ఆమోదించిన ప్రతి ఒక్కరిని విచారిస్తామని, దోషులగా తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.


ఈ న్యూస్ చూసిన నెటిజన్లు మాత్రం అవాక్కవుతున్నారు. ఇన్నేళ్లలో ఆ కాంట్రాక్టర్ అక్రమంగా ఎంత బిల్లు నొక్కేసి ఉంటాడని కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటివరకు ఆ బిల్లులను ఆమోదించిన అధికారులకు కూడా వాటా ఉండి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Also Read: Gyanvapi Masjid Case: జ్ఞానవాపి మసీదులో శివలింగం- కీలక ఆదేశాలు జారీ చేసిన కోర్టు!


Also Read: Healthcare In Rural Areas: గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో భారీగా సిబ్బంది కొరత- సర్వేలో షాకింగ్ విషయాలు!