Unnatural Rape in Mumbai Arthur Road Jail: ముంబయిలోని అర్ధర్ రోడ్ జైలులో ఓ వినూత్నమైన కేసు నమోదు చేశారు. ఓ మగ ఖైదీ తోటి మరో పురుష ఖైదీపై అత్యాచారానికి పాల్పడ్డాడు. జైలులో ఇలా అసహజ లైంగిక దాడి జరిగిందన్న కేసు నమోదు కావడం చర్చనీయాంశం అవుతోంది. అందులో 20 ఏళ్ల ఖైదీపై 19 ఏళ్ల ఖైదీ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు నిందితుడిపై సెక్షన్‌లు 377 (అసహజ నేరాలు), 323 (అసంకల్పిత నరహత్య) మరియు 506 (నేరపూరిత బెదిరింపు) కింద నేరాలను నమోదు చేశారు. ఎన్‌ఎం జోషి మార్గ్ పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై కేసు నమోదైంది. ఈ విషయాన్ని ముంబయి పోలీసులు వెల్లడించారు.


ఈ ఘటన దక్షిణ ముంబైలోని ఆర్థర్ జైలులో మే 14న జరిగింది. ఇది జరిగిన ఒక రోజు తర్వాత బాధితుడు ఈ విషయాన్ని అధికారులకు చెప్పాడు. 19 ఏళ్ల ఖైదీ జకీర్ షా (పేరు మార్చాం)పై ఎన్‌ఎం జోషి మార్గ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అత్యంత భద్రతతో కూడిన జైలులోని బ్యారక్ 7లో నిందితుడు అసహజ రీతిలో మరో తోటి ఖైదీపై ఈ నేరానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు తన ప్యాంటు విప్పి, మరో ఖైదీని బలవంతం చేశాడని తెలిపారు. అందుకు అతను గట్టిగా నిరాకరించగా, బలవంతంగా లైంగిక ప్రక్రియ చేశాడని అన్నారు. ఆ తర్వాతి రోజు బాధితుడు సమాచారం ఇవ్వగా, సంఘటన గురించి జైలు సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఐపీసీలో ఉన్న అసహజ నేరం, స్వచ్ఛందంగా గాయపరచడం, నేరపూరిత బెదిరింపుల కింద కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు.


Also Read: పాప తల్లిదండ్రులతో మీడియా ముందుకు కరాటే కల్యాణి - తనపై భారీ కుట్ర జరుగుతోందని ఆరోపణ !


ఈ కేసులో ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ, ‘‘ఈ సంఘటన గురించి మాకు ఒకరోజు ఆలస్యంగా తెలిసింది. మాకు ఆర్థర్ రోడ్ జైలులోని జైలర్ నుండి కాల్ వచ్చింది. నిందితుడు తన ప్యాంటు విప్పి ఇతర ఖైదీని బలవంతం చేశాడని చెప్పాడు. అయితే బాధితుడు దానిని వ్యతిరేకించాడు. కానీ, బలవంతంగా నిందితుడు తన కోరిక తీర్చుకున్నాడు. బాధితుడు సమాచారం ఇచ్చిన తర్వాత ఈ సంఘటన గురించి అధికారులు ఆ తర్వాత జైలు సూపరింటెండెంట్ మాకు సమాచారం అందించారు. అతనిపై కేసు నమోదు చేశాము. త్వరలో అతణ్ని అరెస్టు చేస్తాం, ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం’’ అని అన్నారు.